ఎట్టకేలకు దేహాన్ని వీడిన సత్యనారాయణ రాజు ఉరఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
దాదాపు నెలరోజులకు పైగా తాను స్ధాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోమాలో ఉన్న సత్యనారాయణ రాజు ఉరఫ్ శ్రీ సత్యసాయి బాబా ఆదివారం తనువు చాలించారు. 86 సంవత్సరాల సాయిబాబా గుండెపోటుతో మరణించారని డాక్టర్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాపితంగా మిలియన్ల మంది అనుచరులను, భక్తులను సంపాదించుకున్న సాయిబాబా యుక్త వయసులోనే తనకు తాను భగవంతుడిగా ప్రకటించుకున్నారు. అప్పటి నుండీ అనేక వివాదాలు ఆయన్ని చుట్టుముట్టినా ప్రభుత్వంలోని అత్యున్నత స్ధానాల్లో ఉన్నవారందరూ ఆయనకు భక్తులు కావడంతో ఆయన పై…