ప్రశ్న: అమెరికాకి ఆధిపత్యం ఎందుకు?

వెంకట్ నాయుడు మీ వెబ్ సైట్ కు ధన్యవాదాలు. నాకు సరిగా అర్ధం కాని విషయం ఏంటంటే ప్రపంచ దేశాలపై అమెరికా ఆధిపత్యం ఎందుకు చూపిస్తుంది? అసలు ఆధిపత్యం చూపించడానికి కారణాలు ఏమిటో చెప్పండి. సమాధానం: ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ అవసరాలు. ప్రతి దేశంలోనూ ఆ దేశ వనరులపై గుత్తాధిపత్యం కలిగిన కొద్దిపాటి ధనిక కుటుంబాలు ఉంటాయి. వారికి సహకారంగా వారి మాట వింటూ పని చేసే ధనిక వర్గాలు మరింత మంది ఉంటారు. వారు…

ప్రశ్న: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకటేనా?

రాకేష్: వలసవాదం, సామ్రాజ్యవాదం ఒకదానికొకటి పర్యాయపదాలా? వలసవాదం కంటే సామ్రాజ్యవాదం విశాలమైనది కావచ్చు, కానీ రెండింటి మధ్య నిర్దిష్ట తేడా ఏమిటి? వలసలు లేకుండా సామ్రాజ్యవాదం పని చేస్తుందా? పని చేస్తే ఉదాహరణలు ఏమిటి? సమాధానం: వలసవాదం, సామ్రాజ్యవాదం పర్యాయపదాలు కాదు. మీ ప్రశ్నలోనే ఉన్నట్లుగా సామ్రాజ్యవాదం విస్తృతమైన భావాన్ని, నిర్మాణాలను, వ్యవస్ధలను తెలియజేస్తుంది. వలసవాదం నిర్దిష్టమైన వ్యవస్ధాగత నిర్మాణం, పరిపాలనలను తెలియజేస్తుంది. వలసవాదం సామ్రాజ్యవాదంలో భాగంగా పరిగణించవచ్చు. కానీ సామ్రాజ్యవాదంలో ఉన్నదంతా వలసవాదంగా చెప్పలేము. వలసవాదం…

గుజరాత్ నరమేధంపై అమెరికా కాంగ్రెస్ తీర్మానం సామ్రాజ్యవాద ప్రయోజనాల కోసమే

గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముస్లిం లపై సాగిన దారుణ నరమేధం జరిగి దశాబ్దం పూర్తయిన సందర్భంగా అమెరికా ప్రతినిధుల సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. గుజరాత్ రాష్ట్రంలో అన్నీ మతాల వారూ మత స్వేచ్చతో బతికే సుహృద్భావ పూరిత వాతావరణం కల్పించాలని గుజరాత్ లోని నరేంద్ర మోడి ప్రభుత్వాన్ని ఆ తీర్మానం కోరింది. 2002 నాటి ‘ముస్లింల హత్యాకాండ’లో బాధితులైన వారికి నరేంద్ర మోడి ప్రభుత్వం సరైన న్యాయం కల్పించేందుకు ఎటువంటి…

లిబియాపై అమెరికా, ఐరోపా దేశాల క్షిపణి దాడులు, పౌరుల మరణం

లిబియా పౌరులను గడ్డాఫీ నుండి రక్షించే పెరుతో అమెరికా, ఫ్రాన్సు, బ్రిటన్ దేశాలు లిబియాలోని తిరుగుబాటుదారుల కేంద్ర పట్టణం ‘బెంఘాజీ’ పై మిస్సైళ్ళతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో లిబియా పౌరులు మరణించినట్లు తెలుస్తున్నది. మరో వైపు గడ్డాఫీ పశ్చిమ దేశాలతో దీర్ఘకాలిక యుద్ధం సాగిస్తానని ప్రతిన బూనాడు. ఐక్యరాజ్యసమితి లోని భద్రతా సమితి చేత దాడులకు అనుకూలంగా తీర్మానం చేయించుకుని, ఆ తీర్మానాన్ని అమలు చేయడానికి దాడులు చేస్తున్నామని పశ్చిమ దేశాలు చెప్పడంలో…

ఫ్రాన్సు అతి తెలివి – ట్యునీషియా మచ్చ లిబియాకు సహాయంతో మటుమాయం?

కల్నల్ మౌమ్మర్ గడ్డాఫీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రస్తుతం గడ్డాఫీ వ్యతిరేకుల ప్రభావంలో ఉన్న లిబియా తూర్పు ప్రాంతానికి సహాయం చేసే పనిలో ఫ్రాన్స్ ఉంది. డాక్టర్లు, నర్సులు, మందులతో రెండు విమానాలు లిబియాలో తిరుగుబాటు దారులకు కేంద్రంగా ఉన్న బెంఘాజీ పట్టణానికి బయలుదేరినట్లు ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఫ్రాంకోయిస్ ఫిల్లాన్ ప్రకటించాడు. ట్యునీషియాలో ప్రజల తిరుగుబాటుతో మాజీ అధ్యక్షుడు జైన్ ఎల్-అబిదైన్ బెన్ ఆలీ పదవీచ్యుతుడయిన విషయం తెలిసిందే. నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చెలరేగుతున్న…