ఇళ్ళల్లో జొరబడి 16 మంది ఆఫ్ఘన్ పౌరులను చంపిన అమెరికా సైనికులు

ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా సైనికుల దుర్మార్గాలు మానవ మాత్రులు ఊహించని స్ధాయికి చేరుకుంటున్నాయి. అమెరికా సైనికుల బృందం ఒకటి కాందహార్ లో ఉన్న తమ స్ధావరానికి సమీపంలో ఉన్న ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళలో చొరబడి నిద్రిస్తున్న పౌరులను అమానుషంగా కాల్చి చంపారు. కేవలం ఒక సైనికులు మాత్రమే, అదీ నేర్వస్ బ్రేక్ డౌన్ కి గురయిన సైనికుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అమెరికా కమేండర్లూ, నాటో అధిపతులూ చెపుతున్నప్పటికీ, అది నిజం కాదనీ అమెరికా ప్రత్యేక బలగాలకు…