ప్రధాని సేవ ప్రజలకు కాదు, ప్రభు వర్గాలకు -కార్టూన్

మంత్రి: దయచేసి అలాంటి దాడులు చేయకుండా సంయమనం పాటించండి. మన దేశ పెట్టుబడి వాతావరణానికి అది నష్టకరం- గౌరవనీయులైన పారిశ్రామికవేత్తలను గాయపరిస్తే… ప్రధాని: ?! ——————————— ప్రధాన మంత్రి మన్మోహన్ గారికి ప్రభుత్వం లోనూ, కాంగ్రెస్ లోనూ ఉన్న గౌరవం ఏపాటిదో వివరించే ఉదాహరణలు కోకొల్లలు. సోనియా గాంధీ విదేశీయత ప్రధాని పదవికి అడ్డు రావడం, పి.వి.నరసింహారావు ఏలుబడిలో భారత దళారీ పెట్టుబడిదారులకు, విదేశీ సామ్రాజ్యవాదులకు నమ్మకంగా సేవలు చేయడం ద్వారా సాధించిన పలుకుబడి అచ్చిరావడంతో దేశ…

బానిసత్వంలో 3 కోట్ల మంది, సగం ఇండియాలోనే

బానిస సమాజం అంతరించిందని గొప్పగా చెప్పుకుంటాం. అది నిజం కాదన్న చేదు నిజం మనం అంగీకరించాల్సిందే. వర్తమాన ప్రపంచంలో 3 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ‘గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013’ (జి.ఎస్.ఐ 2013) సర్వేలో తేలింది. గత సంవత్సరం సర్వే చేసిన ‘ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్’ (ఐ.ఎల్.ఓ) బానిస బతుకులు నెట్టుకొస్తున్నవారి సంఖ్య 2.1 కోట్లని తెలిపింది. వాస్తవం దానికంటే ఘోరమని జి.ఎస్.ఐ 2013 సర్వేలో స్పష్టం అయింది. ప్రపంచంలోని మొత్తం బానిసత్వంలో సగం బానిసత్వాన్ని…