ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకున్న చైనా, ఐ.ఎం.ఎఫ్ ప్రశంస
ఆర్ధిక మాంద్యాన్ని అధిగమించి ‘సాఫ్ట్ ల్యాండింగ్’ ని సాధించగలిగిందని ఐ.ఎం.ఎఫ్ చైనాపై ప్రశంసలు కురిపించింది. ప్రపంచం అంతా నెమ్మదించిన ఆర్ధిక వృద్ధి (slow growth) పరిస్ధితులను ఎదుర్కొంటున్నప్పటికీ వాటన్నింటినీ చైనా తట్టుకోగలిగిందని వ్యాఖ్యానించింది. ఇతర దేశాలతో వాణిజ్య మిగులును తగ్గించుకోవడమే కాక ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేయగలిగిందని ప్రశంసించింది. ఎన్ని పొగడ్తలు కురిపించినా ఆర్ధిక వ్యవస్ధను ఇంకా సంస్కరించాలని సన్నాయి నొక్కులు కూడా నోక్కింది. దేశాన్ని పూర్తిగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అప్పగించాలన్న సందేశాన్ని పరోక్షంగా అందజేసింది. “ప్రపంచ…
