శ్వేతాబసు మీ సాఫ్ట్ టార్గెట్! -సాక్షి తన్వర్ బహిరంగ లేఖ

(కొద్ది రోజుల క్రితం పత్రికలు, ఛానెళ్లు ఓ వార్తను సంచలనం చేస్తూ ప్రచురించాయి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం చేస్తూ సినీ నటి శ్వేతా బసు పట్టుబడిందని ఆ వార్త సారాంశం. ఈ వార్త ప్రచురిస్తూ కొన్ని పత్రికలు అదేదో భ్రహ్మాండమైన నేరాన్ని వెలికి తీసినట్లు ఫోజు పెట్టాయి. సంవత్సరాల తరబడి భద్రతా వ్యవస్ధలకు అంతు చిక్కని నేర పరిశోధన తామే చేసినట్లు బిల్డప్ ఇచ్చాయి. ఈమె పైన గతంలో ఆరోపణలు వచ్చినా ఆమె ఖండించారని…