అణు విద్యుత్తుతో ఆటలా? -కత్తిరింపు

ఏప్రిల్ 30 తేదీన (ఈ రోజు) ఈనాడు ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసం ఇది. అణు శాస్త్రవేత్త బుద్ధికోట సుబ్బారావు గారు రాశారు. తమిళనాడులో నిర్మించబడుతున్న కూడంకుళం అణు విద్యుత్ కర్మాగారానికి రష్యా నుండి నాసిరకం పరికరాలు సరఫరా అయ్యాయని ఆరోపణలు గుప్పుమన్న నేపధ్యంలో ఈ వ్యాసం వెలువడింది. నాసిరకం ఉక్కుతో తయారు చేసిన విడి పరికరాల వలన అణు విద్యుత్ కర్మాగారానికి ముప్పు పొంచి ఉన్నదని రచయిత చర్చించారు. కూడంకుళం అణు కర్మాగారాన్ని భారత ప్రభుత్వం…

అణు శక్తి లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీరతాయి -అధ్యయనం

అణు విద్యుత్ తో పని లేకుండానే భారత విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. బెంగుళూరులోని ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐ.ఐ.ఎస్.సి) కి చెందిన ప్రొఫెసర్లు తయారు చేసిన అధ్యయన నివేదిక ఈ సంగతి ప్రకటించింది. సౌర విద్యుత్తుతో పాటు ఇతర సాంప్రదేయేతర విద్యుత్ వనరుల ద్వారా భారత దేశం యొక్క పూర్తి విద్యుత్ అవసరాలు తీర్చుకోవచ్చని ‘కరెంట్ సైన్స్’ అనే పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అణు విద్యుత్…