హార్డ్ డిస్క్ సహా ఇండియా జాతకం అమెరికా గుప్పిట్లో -స్నోడేన్ పత్రాలు -1
అమెరికా నీతిమాలిన గూఢచర్యం గురించి కళ్ళు తిరిగే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇండియా తనకు ఎంతో కావలసిన మిత్రుడు అని ప్రపంచానికి చాటే అమెరికా, తన గడ్డపై (వాస్తవానికి అది రెడ్ ఇండియన్ల గడ్డ) ఇండియాకు సంబంధించి ఏ కార్యాలయాన్నీ గూఢచర్యం నుంచి మినహాయించలేదు. చివరికి, భారత దేశం యొక్క ప్రపంచ స్ధాయి దౌత్య కార్యకలాపాలకు గుండెకాయ లాంటివి అయిన న్యూయార్క్ లోని ఐరాస శాశ్వత భారత రాయబార కార్యాలయం, వాషింగ్టన్ డి.సి లోని భారత ఎంబసీ…
