వాయు బంధంతో రష్యా చైనాలు ఇంకా దగ్గరికి

బ్రిక్స్ కూటమిలో భాగస్వాములయిన రష్యా చైనా దేశాల మధ్య స్నేహ సంబంధాలు పరవళ్ళు తొక్కుతున్నాయి. అతి పెద్ద ఎనర్జీ మార్కెట్ గా చైనా శరవేగంగా అవతరిస్తున్న నేపధ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయువు ఉత్పత్తిదారయిన రష్యాకు భారీ మార్కెట్ అందుబాటులోకి వస్తోంది. ఈ మార్కెట్ ను సొమ్ము చేసుకునే ప్రక్రియలో భాగంగా ఇరు దేశాల మధ్యా భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. రానున్న 7 సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల (10 వేల కోట్లు) చమురు, సహజవాయువును…