“సల్వా జుడుం” ఏర్పాటు చట్ట విరుద్ధం -చత్తిస్ఘడ్ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గడ్డి పెట్టిన సుప్రీం కోర్టు – 2
“(సల్వా జుడుం యొక్క) రాజ్యాంగబద్ధమైన సమ్మతిని కొలవడానికి ఆ బలగాల ప్రభావశీలత (effectiveness) ఒక్కటే కొలబద్ద కాజాలదు, కాగూడదు కూడా. ఛత్తీస్ ఘఢ్లో మావోయిస్టు/నగ్జలైట్ల కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎస్.పి.ఓ లు ప్రభావవంతంగా ఉన్నాదన్న అంశం తప్పుడు ప్రతిపాదన, కాకుంటే అనుమానాస్పదమైన ప్రతిపాదన. వాదన కోసం నిజంగానే ఎస్.పి.ఓలు మావోయిస్టులు/ నగ్జలైట్లకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉపయోగపడుతున్నారని అంగీకరించినా, తద్వారా వారివలన చేకూరుతున్నాయంటున్న అనుమానాస్పద లాభాలు, రాజ్యాంగంపై ఉండవలసిన పవిత్ర నమ్మకం, గౌరవాలను పెద్ద ఎత్తున కోల్పోవడానికీ, సామాజిక క్రమబద్ధత…