‘గోధ్రా’ అనంతర హత్యాకాండ, 31 మందిపై నేర నిర్ధారణ

గోధ్రా లో రైలు దహనకాండ అనంతరం, నరేంద్ర మోడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లిం ప్రజలపై జరిగిన దారుణ హత్యాకాండపై జరుగుతున్న అనేక కేసుల విచారణలో మొదటిసారిగా నేర నిర్ధారణ జరిగింది. సర్దార్ పురా హత్యకాండకుగాను 31 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. శిక్షలు ఇంకా ఖరారు కావలసి ఉంది. హత్యాకాండపై విచారణకు సుప్రీం కోర్టు నియమించిన ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం’ విచారణ జరిగిన కేసులో కోర్టులో నేర నిర్ధారణ జరగడం…