అమెరికా సెనేట్‌లో విచిత్రం, వివాద పరిష్కారానికి చైనా బలప్రయోగంపై ఖండన తీర్మానం
అమెరికా సెనేట్‌లో సోమవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బహుశా ప్రపంచ వింతల్లో ఒకటిగా ఇది స్ధానం సంపాదించుకోవచ్చు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాల పరిష్కారానికి చైనా బల ప్రయోగం చేయడాన్ని ఖండిస్తూ అమెరికా సెనేట్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అదీ ఏకగ్రీవంగా. ఒక దేశానికి ‘బల ప్రయోగం చేయడం తగదు” అని సుద్దులు చెప్పే అర్హత అమెరికా తనకు తాను దఖలు పరుచుకోవడమే ఇక్కడ వింత. బల ప్రయోగం చేస్తే చైనాని నిస్సందేహంగా తప్పు పట్టవలసిందే.…