సరిహద్దులో పాక్ దాగుడుమూతలు! -కార్టూన్
సరిహద్దులో పాకిస్ధాన్ ‘కాల్పుల విరమణ’ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తోందని పత్రికలు, ఛానెళ్లు కొద్ది రోజులుగా చెబుతున్నాయి. దేశంలో పరిస్ధితి తమకు అనుకూలంగా లేనప్పుడు, పార్లమెంటులో ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన బిల్లులు ప్రవేశపెట్టి, ప్రతిపక్షాలు నిరసనల రూపంలో ఇచ్చే పరోక్ష మద్దతుతో మూజువాణి ఓటుతో ఆమోదించాలనుకున్నపుడు సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు తలెత్తడం మామూలు విషయమే. ఈ ఎత్తుగడల్లో సైనికుల ప్రాణాలు ఉట్టిపుణ్యానికి హరీమన్నా పాలక పెద్దలకు లెక్కా, జమా ఉండవు. ప్రస్తుతం తలెత్తిన ఉద్రిక్తతలు కూడా ఆదేకోవలోనివే…