అధ్యక్షా! తల ఎక్కడ పెట్టుకుంటారు?

సిరియా ప్రభుత్వ బలగాల వద్ద రసాయన ఆయుధాలు ఉన్నాయని, సామూహిక విధ్వంసక ఆయుధాలుగా ఐరాస వర్గీకరించిన ఈ ఆయుధాలను సిరియా ప్రభుత్వం తిరుగుబాటుదారులపై వినియోగించినట్లయితే అది ‘ఎర్ర గీత’ దాటినట్లేనని అమెరికా అధ్యక్షుడు ఒబామా గత సంవత్సరం హెచ్చరించాడు. కానీ ఐరాస మానవ హక్కుల సంస్ధ ప్రతినిధి, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్లలో ఒకరు అయిన కార్లా డెల్ పాంటే ప్రకారం సిరియా కిరాయి తిరుగుబాటుదారులే సిరియా ప్రజలపై రసాయన ఆయుధాలు వాడారనేందుకు ప్రాధమిక సాక్ష్యాలు లభ్యమయ్యాయని…