డబ్బు, మద్యం లేని ఎన్నికలు సాధ్యం కాదా?
ప్రశ్న (ఎ.మనోహర్): మన దేశంలో డబ్బు, మద్యం లేకుండా ఎన్నికలు జరపలేమా? సమాధానం: ఇది చాలామందిని వేధించే ప్రశ్న. ఎన్నికలు నీతివంతంగా జరిగితే ఆ వచ్చే నాయకులు నీతివంతంగా ఉంటారన్న ఆశ ఈ ప్రశ్నలో ఇమిడి ఉంటుంది. లోక్ సత్తా పార్టీ నాయకులు జయప్రకాష్ నారాయణ లాంటి నాయకులు సైతం ఎన్నికల్లో సరైన అభ్యర్ధులను ఎన్నుకుంటే దేశం దానంతట అదే బాగుపడుతుందని ప్రబోధిస్తున్నారు. కానీ అది నిజమేనా? చెట్టు ముందా, విత్తు ముందా అని ప్రశ్నిస్తే ఏమిటి…