తెలంగాణ: పామూ నిచ్చెనల ఆటకు వేదిక -కార్టూన్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం సంగతేమో గానీ ఆ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలు పరమ జుగుప్సను కలిగిస్తున్నాయి. ప్రజల దైనందిన సమస్యల గురించి ఏనాడూ పట్టించుకోని ప్రబుద్ధులు కొందరు ఇప్పుడు సీమాంధ్ర ప్రజల భవిష్యత్తు నాశనం అయిపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. మరి కొందరు తెలంగాణ వస్తే చాలు ఇక స్వర్గమే అన్నట్లుగా ‘అరచేతిలో వైకుంఠం’ చూపుతున్నారు. ఇద్దరూ కలిసి అటూ, ఇటూ జనాన్ని ఎంతగా వంచించగలరో అంతా వంచిస్తున్నారు. కాకపోతే అసెంబ్లీ, పార్లమెంటు వేదికగా…
