బీహార్ ఎస్.ఐ.ఆర్: అసలేం జరుగుతోంది?
బీహార్ లో ఎలక్షన్ కమిషన్ చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ గురించి పూర్వ రంగం గురించి కాస్త తెలుసుకుంటే ఉపయోగం. మూలం ఏమిటో తెలియకుండా బీహార్ ఎస్.ఐ.ఆర్ అంటూ ఎన్ని పోస్టులు రాసినా వృధాయే కదా! బీహార్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం జనవరి 2025 లో బీహార్ వోటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ‘సమ్మరీ రివిజన్’ పేరుతో సవరించింది. సవరించి వోటర్ల జాబితా తుది నిర్ధారిత జాబితాను…
