సల్మాన్ కో న్యాయం, అఫ్జల్ కో న్యాయం! -2
“అప్పీలుదారు ఎలాంటి అనుమానం లేకుండా దోషియే అని నిర్ధారించ గల స్ధాయిలో ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం, ఈ కోర్టు దృష్టిలో, లేదు. అనుమానం అన్నది, అది ఎంత బలంగా ఉన్నప్పటికీ, ఎవరినైనా సరే దోషిగా నిర్ధారించడానికి సరిపోదు. “కీలక సాక్ష్యాలను నమోదు చేయక పోవడంలో ప్రాసిక్యూషన్ లో లోపాలు ఉన్నాయి. గాయపడిన వారి సాక్ష్యాలలో విడుపులు (omissions), వైరుధ్యాలు ఉన్నాయి. సాక్ష్యాల సేకరణలో దొర్లినట్లుగా కనిపిస్తున్న లొసుగులు నిందితునికే లాభం చేకూర్చుతాయి. “ప్రజల అభిప్రాయం ఏమిటో మాకు…