మహిళని అరవై వేలకి అమ్మేసి, రక్షించబోయిన పోలీసుల్నీ కొట్టి…

రెండు ఉత్తర భారత రాష్ట్రాలలో జరిగిన ఘాతుకం ఇది. భర్త చనిపోయిన మహిళను అరవై వేల రూపాయలకి అమ్మడమే కాక ఆమెని కాపాడడానికి వెళ్ళిన సోదరుడినీ తన్ని తరిమేశారు. అనంతరం ఆమెని కాపాడడానికి వెళ్ళిన పోలీసు బృందాన్ని కూడా కొట్టి తరిమారు. ఇపుడు మరో పోలీసు బృందాన్ని పంపుతున్నామని మధ్య ప్రదేశ్ లోని జిల్లా ఎస్.పి చెప్పాడు. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళను ముగ్గురు వ్యక్తులు రాజస్ధాన్ లోని ఓ గ్రామస్ధునికి అమ్మేశారు. అమ్మిన ముఠాలో…

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో పెరుగుతున్న కుటుంబ హింస

ఆర్ధిక సంక్షోభం వల్ల అమెరికాలో కుటుంబ హింస పెరుగుతోందని పోలీసుల సర్వే తెలియజేసింది. ఆర్ధిక పరిస్ధితులు చట్టాల అమలుపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న విషయంపై అమెరికాకి చెందిన ‘పోలీస్ ఎక్సిక్యూటివ్ రీసెర్చ్ ఫోరం’ రెగ్యులర్ గా సమీక్ష జరుపుతుంది. సర్వేలో ప్రతిస్పందించిన 700 సంస్ధలలో 56 శాతం ‘పూర్ ఎకానమీ’ వల్ల కుటుంబ హింస పెరిగిందని తెలిపాయి. ఇది 2011 సంవత్సరం లోని పరిస్ధితి కాగా 2010 లో 40 శాతం సంస్ధలు సంక్షోభ పరిస్ధితులు కుటుంబ…

కొత్త వీసా రూల్స్ తో మోడిని రాకుండా చెయ్యండి -బ్రిటన్ మానవ హక్కుల సంస్ధలు

యూరోపియన్ యూనియన్ ప్రతిపాదిస్తున్న కొత్త వీసా నిబంధనలను నరేంద్ర మోడి కి వర్తింపజేసి బ్రిటన్ కి రాకుండా అడ్డుకోవాలని అక్కడి మానవ హక్కుల సంస్ధలు డిమాండ్ చేశాయి. ఇ.యు దేశాలకు చెందని వారు తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడితే వారిని బ్రిటన్ రాకుండా నిషేధించాలని కొత్త నిబంధనను బ్రిటన్ ప్రతిపాదిస్తున్నది. ఈ నిబంధనను మోడీకి వర్తింపజేసి భవిష్యత్తులో ఆయన బ్రిటన్ లో అడుగుపెట్టనివ్వకుండా చేయాలని మానవ హక్కుల గ్రూపులు ఆదివారం డిమాండ్ చేశాయి. నరేంద్ర మోడి…

హైద్రాబాద్ మత కల్లోలానికి హిందువులే కారణం

మూడువారాల క్రితం హైద్రాబాద్ లో చెలరేగిన మత ఘర్షణలకు హిందువులే కారణమని పోలీసుల పరిశోధనలో తేలింది. ఇద్దరు స్ధానిక నాయకుల ప్రోత్సాహంతో హిందూ యువకులు మత కల్లోలం రెచ్చగొట్టడానికి పూనుకున్నారని పోలీసులు శనివారం తెలిపారు. మాదన్నపేట దేవాలయంలో ఆవు కాళ్ళు పడేసి, పచ్చ రంగు జల్లితే అది ముస్లింలు చేసిన పనేనని హిందువులు భావించి ముస్లింలపై దాడులకు పూనుకుంటారని పధకం వేశారని పోలీసులు తెలిపారు. ఆవు కాళ్ళను గుడిలో ఉంచి పచ్చరంగు జల్లిన హిందూ యువకులను పోలీసులు…

బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు, జడ్జి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ కోర్టు బి.జె.పి మాజీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి బంగారు లక్ష్మణ్ కి నాలుగేళ్ళు జైలు శిక్ష విధించింది. జరిమానాగా లక్ష రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు నిచ్చాడు. శిక్ష విధిస్తూ అడిషనల్ సెషన్స్ జడ్జి కన్వల్ జీత్ అరోరా సంచలన వ్యాఖ్యలు చేశాడు. జడ్జి విధించిన శిక్ష, తదనంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాపితంగా ఉన్న కోర్టులు పాటించినట్లయితే దాదాపు భారత దేశ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు అందరూ జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.…

అవినీతి కేసులో బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ దోషి -సి.బి.ఐ కోర్టు

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ను అవినీతి కేసులో దోషిగా సి.బి.ఐ కోర్టు నిర్ధారించింది. తెహెల్కా పత్రిక నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో కంపెనీ ప్రతినిధులుగా నాటకమాడిన తెహెల్కా విలేఖరుల వద్ద నుండి లక్ష రూపాయల నోట్ల కట్లను తీసుకుంటూ బంగారు లక్ష్మణ్ వీడియో కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. 2001 లో జరిగిన ఈ సంఘటనలోని వీడియో దేశ వ్యాపితంగా అన్నీ చానెళ్లలోనూ ప్రసారం అయింది. పార్టీ కోసం చందా తీసుకున్నానని లక్ష్మణ్ అప్పట్లో వివరణ…

క్లుప్తంగా… 26.04.2012

అంతర్జాతీయం హెచ్.ఎస్.బి.సి బ్యాంకు యు.కె శాఖల్లో 2,200 ఉద్యోగాలు రద్దు ఇంగ్లాండులో హెచ్.ఎస్.బి.సి బ్యాంకు మరో 2,200 ఉద్యోగాలు రద్దు చేసింది. వాస్తవంగా రద్దు చేసినవి 3,100 ఉద్యోగాలు కాగా, కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు పోను నికరంగా 2,217 ఉద్యోగాలు రద్దు చేసినట్లయింది. ఖర్చు తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాలు రద్దు చేస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. హెచ్.ఎస్.బి.సి గత సంవత్సరం 7,000 ఉద్యోగాలు రద్దు చేసింది. 2013 లోపు ప్రపంచ వ్యాపితంగా 30,000 ఉద్యోగాలు రద్దు చేస్తానని…

ఫెయిలయినందుకు టీచర్లందరినీ నిర్భంధించిన XI క్లాస్ విద్యార్ధులు

పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలో క్లాస్ XI సంవత్సరాంత పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్ధులు టీచర్లందరినీ స్కూల్ లోపల పెట్టి తాళాలు వేశారు. తమని క్లాస్ XII కు ప్రమోట్ చేశామని చెబితే తప్ప విడుదల చేయబోమని పట్టుపట్టారు. దాదాపు తొంభై మంది విద్యార్ధులు ఈ కార్యక్రమంలో ఉండడంతో జోక్యం చేసుకోవడానికి పోలీసులు వెనకాడుతున్నారు. స్కూల్ సెక్రటరీ కూడా నిర్బంధించబడివనారిలో ఉండడం విశేషం. గోపీబల్లభ్ పూర్ లోని ‘నయబాసన్ జనకళ్యాణ్ విద్యాపీఠ్’ అనే పాఠశాలలో గురువారం…

పై చదువులకోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక ‘రిటర్న్ బాండ్’ ఇవ్వాలి

పై చదువుల కోసం అమెరికా వెళ్ళే డాక్టర్లు ఇక నుండి దేశానికి తిరిగొస్తామని బాండ్ పేపర్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. అమెరికాలో చదువులు పూర్తయ్యాక అక్కడే స్ధిరపడడానికి భారతీయ డాక్టర్లు మొగ్గు చూపుతున్నారనీ, ఉన్నత చదువుల పేరుతో వెళ్ళి అక్కడే ఉండిపోతున్నారనీ ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వారిని అడ్డుకోవడానికి కొత్త నిబంధన విధిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపాడు. “ఏ విధ్యార్ధి అయినా వైద్య చదువుల కోసం అమెరికా వెళ్తే…

teluguvartalu

ఈనాడు లో ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్

సోమవారం (23.04.2012) నాటి ఈనాడు దిన పత్రిక తన పాఠకులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ బ్లాగ్ ను పరిచయం చేసింది. ప్రతి సోమవారం విద్యార్ధులు, ఉద్యోగార్ధుల కోసం అందిస్తున్న ‘చదువు’ పేజీలో ఈ బ్లాగ్ ను పరిచయం చేసింది. సివిల్స్ లాంటి పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్దులు, ఉద్యోగార్ధులకు ‘జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ’ ఉపయోగకరంగా ఉందని తెలియజేసింది. – గత సంవత్సరం ఫిబ్రవరి 4 తేదీన ఈ బ్లాగ్ ప్రారంభం అయింది. ముఖ్యమైన…

ఇండియాలో టి.బి చావులు రోజుకి 1,000

భారత దేశ పాలకవర్గాలు సిగ్గుతో తల దించుకోవలసిన చేదు నిజం ఇది. ట్యూబర్కులోసీస్ (టి.బి) వ్యాధి బారిన పడిన భారతీయ రోగులు సరైన వైద్యం అందక రోజుకు 1,000 మంది చనిపోతున్నారు. మరే దేశంలోనూ ఇంతమంది టి.బి రోగులు మృత్యువాత పడడం లేదు. చనిపోతున్న టి.బి రోగుల్లో ప్రతి ఐదు నిమిషాలకు చనిపోతున్న ఒక పిల్లవాడు కూడా ఉన్నాడని టి.బి వ్యాధి నివారణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్ధ టి.బి.ఎ.ఐ (ట్యూబర్కులోసీస్ అలర్ట్ ఇండియా) తెలియజేసింది.…

Saving Taxpayers money

ఖజానాపై భారం తగ్గించిన ఒబామా భద్రతాధికారులు! -కార్టూన్

కొలంబియాలో ఒబామా భద్రత కోసం వెళ్ళిన భద్రతా సిబ్బంది పన్నెండు మంది ‘ఎస్కార్ట్’ మహిళలతో ఉండగా దొరికిపోయి విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ కాన్ఫరెన్స్ కోసం కొలంబియా లోని కార్టిజీనా నగరానికి కొద్ది రోజుల క్రితం ఒబామా వెళ్ళివచ్చాడు. స్ధానిక క్లబ్ లో తాగి అక్కడే మహిళలతో బేరం కుదుర్చుకుని తాము బస చేసిన హోటల్ కి తీసుకెళ్లారు. $800 ఇస్తానని చెప్పి ఉదయాన్నే $30 మాత్రమే ఇవ్వజూపడంతో ఒక మహిళ…

$800 కి ఒప్పుకుని $30 ఇచ్చి దొరికిపోయిన ఒబామా భద్రతాధికారులు

ఒక రాత్రికి 800 డాలర్లు ఇస్తామని ఒప్పుకున్న అమెరికా భద్రతాధికారులు సేవ ముగిశాక 30 డాలర్లు మాత్రమే ఇచ్చి మోసం చేయడంతో పోలీసులకి పట్టుబడ్డారని బి.బి.సి తెలిపింది. కొలంబియా లో జరిగిన ‘ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికా స్టేట్స్’ (ఒ.ఎ.ఎస్) కాన్ఫరెన్స్ కి హాజరయిన బారక్ ఒబామా భద్రత కోసం కొలంబియా వెళ్ళిన అమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులు వ్యభిచారం చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఒప్పుకున్న మొత్తాన్ని చెల్లించకుండా ఒబామా భద్రతాధికారి మోసం చేయబోవడంతో మహిళ ఆగ్రహం…

‘దళిత హత్యాకాండ’ కేసులో శిక్షలన్నీ రద్దు చేసిన బీహార్ హై కోర్టు

భారత దేశంలో దళితులకి న్యాయం సుదూర స్వప్నమేనని మరోసారి రుజువయింది. 21 మంది దళితులను, ముస్లింలను బలితీసుకున్న ‘బఠానీ టోలా’ హత్యాకాండ కేసులో బీహార్ హై కోర్టు శిక్షలన్నింటినీ రద్దు చేసేసింది. మంగళవారం నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. సాక్ష్యాలు బలంగా లేవని చెప్పింది. ‘అనుమాన రహితం’గా నేరం రుజువు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని చెప్పింది. కింది కోర్టు ముగ్గురిపై విధించిన ఉరి శిక్షను, మరో 20 మందికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షనూ ఒక్క తీర్పుతో…

‘కట్నపిశాచి’ వద్దకి రానందని మహిళను చితక బాదిన పోలీసులు

పోలీసు గూండాయిజానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. భర్త కట్న దాహాన్ని తీర్చలేక ప్రొఫెసర్ ని శరణు వేడిన మహిళను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లి కట్న పిశాచికి అప్పగించడానికి ప్రయత్నించారు. మహిళను తీసుకెళ్లడానికి మహిళా పోలీసులను వినియోగించాలన్న చట్టాన్ని ఘోరంగా ఉల్లంఘించారు. రాష్ట్ర సరిహద్దుని దాటి మరీ పైశాచికత్వం ప్రదర్షించారు. తమ ఆధీనంలో ఉన్న మహిళను కొడుతున్నప్పటికీ మౌన ప్రేక్షకులుగా మిగిలినందుకు, స్ధానిక జిల్లా ఎస్.పి, ఒక ఎస్.ఐ తో సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశాడు. మహిళ…