ఎట్టకేలకు దేహాన్ని వీడిన సత్యనారాయణ రాజు ఉరఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా

దాదాపు నెలరోజులకు పైగా తాను స్ధాపించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోమాలో ఉన్న సత్యనారాయణ రాజు ఉరఫ్ శ్రీ సత్యసాయి బాబా ఆదివారం తనువు చాలించారు. 86 సంవత్సరాల సాయిబాబా గుండెపోటుతో మరణించారని డాక్టర్లు ప్రకటించారు. ప్రపంచ వ్యాపితంగా మిలియన్ల మంది అనుచరులను, భక్తులను సంపాదించుకున్న సాయిబాబా యుక్త వయసులోనే తనకు తాను భగవంతుడిగా ప్రకటించుకున్నారు. అప్పటి నుండీ అనేక వివాదాలు ఆయన్ని చుట్టుముట్టినా ప్రభుత్వంలోని అత్యున్నత స్ధానాల్లో ఉన్నవారందరూ ఆయనకు భక్తులు కావడంతో ఆయన పై…

వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావని శరద్ పవార్

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కి వరి, గోధుమ ఎగుమతులపై ఆశ చావక మరోసారి నోరు విప్పారు. వరి, గోధమల ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆశాజనకంగా ఉన్నాయని, నిల్వలు కూడా అధికంగా ఉన్నాయి కనుక ఎగుమతి చేయడానికి ఇదే సరైన సమయమని, ప్రభుత్వం వరి, గోధుమ ధాన్యాల ఎగుమతులకు అనుమతించాలని ఆయన పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వంలో ఓ మంత్రిగా ఉంటూ, అందునా వ్యవసాయ మంత్రిగా ఉంటూ పత్రికాముఖంగా డిమాండ్ చేయడం…

ఆకలి, దరిద్రాలతో బడి మానేస్తున్న బ్రిటన్ విద్యార్ధులు

బడిమానేయడం ఇండియాలో సర్వ సాధారణం. పిల్లల్ని కూలికి పంపితే కుటుంబానికి కొంచెం ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో పల్లేల్లొ పేద రైతులు, కూలీలు తమ పిల్లలు చేతికందాక బడిమానిపిస్తారు. మూడు సంవత్సరాల క్రితం సంభవించిన ప్రపంచ ద్రవ్య, ఆర్ధిక సంక్షోభాల పుణ్యమాని ఇప్పుడు యూరప్ లోని ధనిక దేశాల్లో సైతం ఆ పరిస్ధితులు తలెత్తుతున్నాయి. ఆర్ధిక సంక్షోభం తర్వాత స్తంభించిపోయిన ఆర్ధిక కార్యకలాపాలను పునరుద్ధరించి వేగవంతం చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలు ట్రిలియన్ల కొద్దీ డాలర్లను ప్రవేటు బహుళజాతి…

అవినీతిపై పోరాటం ఇంత సులువా?

అన్నా హజారే! ఇప్పుడు చాలామంది భారతీయుల నోట నానుతున్న పేరు. నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాడని భావిస్తున్న బ్రహ్మచారి. గాంధేయుడయిన హజారే, గాంధీ బోధించిన అహింసా సిద్ధాంత పద్ధతిలో పోరాటం చేసి రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ల అవినీతి అంతానికి నడుం బిగించాడని దేశవ్యాపితంగా ప్రశంసలు పొందుతున్నాడు. ఉన్నత స్ధానాల్లోని వ్యక్తులు -మంత్రులు, బ్యూరోక్రట్ అధికారులు- విచ్చలవిడిగా అవినీతికి పాల్పడికూడా ఎట్టి విచారణ లేకుండా తప్పించుకుంటున్నారనీ, అటువంటి వారిని విచారించే అత్యున్నత…

అమెరికాలో ఖురాన్ తగలబెట్టడంపై ఆఫ్ఘనిస్తాన్ లో విస్తరిస్తున్న హింసాత్మక నిరసనలు

మార్చి 20 తేదీన అమెరికాలోని ఫ్లోరిడాలో క్రైస్తవ మత మూర్ఖుడు పాస్టర్ ‘టెర్రీ జోన్స్ ‘ ముస్లిం మత పవిత్ర గ్రంధం “ఖురాన్”ను తగలబెట్టడాన్ని నిరసిస్తూ ఆఫ్ఘనిస్తాన్లో హింసాత్మక నిరసనలు దేశమంతటా విస్తరిస్తున్నాయి. కాందహార్, జలాలాబాద్ పట్టణాల్లో వందలమంది ఆఫ్ఘన్లు నిరసన ప్రదర్శనలు జరిపారు. ఉత్తర ఆఫ్గనిస్తాన్ లోని మజార్-ఎ-షరీఫ్ పట్టణంలో గత శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల అనంతరం జరిగిన హింసలొ 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వీరిలో ఏడుగురు ఐక్యరాజ్యసమితి ఉద్యోగులు. కాందహార్…

గూగుల్ చాలా ఘోరాలు చేస్తోంది -అమెరికా రెగ్యులేటర్ ఎఫ్.టి.సి

సెర్చి ఇంజన్ల వ్యాపారంలో ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకున్న గూగుల్ వినియోగదారుల హక్కులను పరిరక్షించడంలో పదే పదే తప్పు చేస్తోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ పేరుతో వైర్ లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తూ అనేక దేశాల్లో దొరికిపోయిన గూగుల్ చివరికి తన ఈ మెయిల్ ప్రోగ్రాం ఐన జీమెయిల్ వినియోగదారుల సమాచారాన్ని కూడా తన వ్యాపార ప్రయోజనాలకు వినియోగించి అమెరికా నియంత్రణ సంస్ధకు దొరికిపోయింది. ఇలా అడ్డంగా దొరికిపోవడం గూగుల్ కి…

జపాన్ అణు రియాక్టర్ లీకేజి, నీరు, భూమి, గాలి లలో రేడియేషన్ మరింత తీవ్రం?

రోజులు గడుస్తున్నకొద్దీ జపాన్ లోని ఫుకుషిమా దైచి అణు రియాక్టరు వద్ద రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ ప్రమాదం, ప్రమాదకర రేడియేషన్ భయాలు పెరుగుతున్నాయి తప్ప ఉపశమించడం లేదు. అణు విద్యుత్ తో పెట్టుకుంటే ఏర్పడే ప్రమాదాలకు విరుగుడు మనిషి చేతిలో లేదని అంతకంతకూ స్పష్టం అవుతోంది. అత్యంత శుభ్రమైనదీ, పర్యావరణ రక్షణకు అత్యంత అనుకూలమైందీ అన్న పేరుతో పశ్చిమ దేశాలు అణు విద్యుత్ కి ఇటీవల కాలంలో ప్రచారం పెంచాయి. పర్యావరణం తర్వాత సంగతి, ముందు మానవాళి…

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి, ఆగ్రహించిన అమెరికా రాయబారి -వికీలీక్స్

దావూద్ ఇబ్రహీం కూతురి పెళ్ళి ప్రముఖ పాకిస్తాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు తొ జరిగిన విషయం తెలిసిందే. జులై 2005 లో జరిగిన ఈ వివాహం రిసెప్షన్ జులై 23, 2005 తేదీన దుబాయ్ లోని హోటల్ హయత్ లో జరిగింది. ఈ హోటల్ యజమాని అమెరికాకి చెందిన హయత్ కార్పొరేషన్ కావడమే అమెరికా రాయబారి ఆగ్రహానికి కారణం. దుబాయ్ లోని హోటల్ హయత్ అమెరికాకి చెందిన హోటల్ అని భారత దేశంలో అందరికీ తెలుసనీ,…

కాంగ్రెస్ లో కలిసిపోయే టి.ఆర్.ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు క్షమించవచ్చా?

కాంగ్రెస్ పార్టీలో టి.ఆర్.ఎస్ ని కలిపేస్తే తప్ప “తెలంగాణ రాష్ట్రం” ఇవ్వబోమని కాంగ్రెస్ అధినేత సోనియా గాంధి అన్నట్లు కే.సి.ఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కే.సి.ఆర్ దాన్ని అవాస్తవమని కొట్టిపారేసినా, ఆయన ఎం.ఎస్.ఓ ల సంఘం సమావేశంలో ఈ విషయాన్ని చెప్పినట్లు వార్తా ఛానెళ్ళు మంగళవారం అంతా ప్రసారం చేశాయి. ఒక సంఘం సమావేశంలో చెప్పాడంటున్న వార్తను అంత తేలిగ్గా కొట్టేయలేము. అదీకాక కే.సి.ఆర్ కి ఇటువంటి ప్రకటనలు ఇవ్వడం మామూలే. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలు…

‘ముస్లింల నరమేధం గుజరాత్ అంతర్గత వ్యవహారం’, అమెరికా రాయబారితో నరేంద్ర మోడి – 1

2002 సంవత్సరంలో గోధ్రా రైలు బోగీ దహనం అనంతరం నరేంద్ర మోడి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో ముస్లిం ప్రజలపై సాగించిన నరమేధానికి బాధ్యులైన వారిపై ఏం చర్య తీసుకున్నారు అనడిగిన అమెరికా రాయబారి ప్రశ్నకు కోపంతో, “అది గుజరాత్ అంతర్గత వ్యవహారం. ఆ విషయం గురించి ప్రశ్నించే అధికారం అమెరికాకు లేదు” అని నరేంద్ర మోడి హుంకరించిన విషయం అమెరికా రాయబారి రాసిన కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. ఇండియాలో పని చేసిన అమెరికా రాయబారులు అమెరికా…

‘నందిగ్రాం హింస’తో అమెరికాలో శిక్షణార్హత కోల్ఫోయిన ఐ.పి.ఎస్ అధికారి -వికీలీక్స్

తమ భూముల్ని అక్రమంగా లాక్కుని ఇండోనేషియా వ్యాపార గ్రూపుకి అప్పగించడానికి వ్యతిరేకంగా నందిగ్రాం ప్రజలు జరిపిన వీరోచిత పోరాటంపై కాల్పులు జరిపి అనేకమంది చనిపోవడానికి కారణమయ్యాడన్న ఆరోపణ ఉండడం వలన అమెరికాలో ట్రైనింగ్ పొందే అవకాశాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసు ఉన్నతాధికారి కోల్పోయిన విషయం వికీలీక్స్ బయట పెట్టిన డిప్లొమాటిక్ కేబుల్ ద్వారా వెల్లడయ్యింది. అమెరికాలో పోలీసు, మిలట్రీ శిక్షణ పొందాలనుకునే వారు మానవహక్కులు గౌరవించడంలో వ్యతిరేక రికార్డు ఉండకూడదని అమెరికా చట్టాలు నిర్దేశిస్తాయి. నందిగ్రాం ఆందోళకారులపై…

ఒక్క నెలలో 32 లక్షల సెల్ ఫోన్ల అమ్మకం

  అనీల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (ఎ.డి.ఎ.జి – అడాగ్) కి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ ఒక్క జనవరి నెలలోనే 3.2 మిలియన్ ల (32 లక్షలు) మొబైల్ ఫోన్లు అమ్మినట్లుగా శుక్రవారం తెలిపింది.  జనవరి నెలలో అమ్మిన ఫోనలతో కలిపి రిలయన్స్ కాం కంపెనీ ఇప్పటికి మొత్తం ఇండియాలో 128.9 మిలియన్ల (12.89 కోట్లు) సెల్ ఫోన్లు అమ్మినట్లుగా ఆ కంపెనీ తెలిపింది. అంటే జనవరి ఆఖరుకల్లా భారతీయుల చేతుల్లో కేవలం రిలయన్స్ కంపెనీ…