ప్రియుడి మోసంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ కెమెరా కంటికి చిక్కిన పెళ్ళి కూతురు -వీడియో

మే 17 తేదీన 22 ఏళ్ళ చైన యువతి నాలుగు సంవత్సరాలనుండి ప్రేమిస్తున్న తన ప్రియుడు పెళ్ళి ప్రయత్నాల్లో ఉండగానే పెళ్ళికి నిరాకరించడంతో తీవ్ర నిరాశలో ఏడంతస్ధుల భవంతిలోని ఏడో అంతస్ధు కిటికీ నుండి దూకి అత్మ హత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. స్ధానిక అధికారి చివరి నిమిషంలో ఆమె చేతిని, పెళ్ళి దుస్తుల్లోని కొంత భాగాన్ని పట్టుకొని లోపలికి లాగడంతో అమె బతికి బైట పడింది. సదరు వీడియో ని ఇక్కడ చూడవచ్చు.

ప్రియుడి మోసంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ కెమెరా కంటికి చిక్కిన పెళ్ళి కూతురు -ఫొటోలు

చైనాలోని జిలిన్ రాష్ట్రంలోని చాంగ్‌చువాన్ పట్టణంలో 22 ఏళ్ళ యువతి ఏడంతుస్తల భవనంలోని ఏడో అంతస్తునుండి దూకి అత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.  నాలుగేళ్ళుగా ప్రేమిస్తున్న తన ప్రియుడు చివరి నిమిషంలో పెళ్ళికి నిరాకరించడంతో పెళ్లి దుస్తుల్లోనే అత్మహత్యకి ప్రయత్నించింది. అయితే ఆమె అత్మహత్యకు ప్రయత్నిస్తుండగా చూసిన గువో ఝాంగ్‌ఫాన్ అనే స్ధానిక అధికారి, కిటికీనుండి దూకబోతున్న అమెను దూకిన క్షణాల్లోనే సమయానికి పట్టుకోవడంతో ఆమె బతికిపోయింది. ఆమెకు గాయాలేవీ తగల్లేదని తెలిసింది. సదరు దృశ్యాలను కింది ఫోటోలలో…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -2

గత పోస్టు తరవాయి భాగం… 3. ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక హక్కులు వాస్తవ నిరుద్యోగం అధికారిక అంచనాల కంటె చాలా అధికంగా 20 శాతం పైనే ఉంది. (ఇది అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). ఆహారం, ఇంధనం, వైద్య ఖర్చులు, విద్యా ఖర్చులు తదితర ధరలు అధికారిక లెక్కల్లో చాలా తక్కువచేసి చూపడం వలన వాస్తవ ద్రవ్యోల్భణం 10 శాతం పైనే ఉంటుంది. (ఇది కూడా అధికారిక అంచనాకి రెట్టింపుకంటె ఎక్కువ). జీవనానికి పడుతున్న వాస్తవ ఖర్చు…

అమెరికా మానవ హక్కుల రికార్డు పరమ ఘోరం -1

ప్రతి సంవత్సరం అమెరికా ప్రపంచ దేశాల మానవ హక్కుల ఆచరణ తీరుపై ఒక నివేదిక వెలువరిస్తుంది. 2010 సంవత్సరానికి కూడా అలావే మానవ హక్కుల నివేదికని వెలువరించింది. అందులో 190కి పైగా దేశాలపై తన తీర్పు రాసుకుంది. 145 పేజీల ఈ నివేదికలో అమెరికా మానవహక్కుల రికార్డు మాత్రం ఉండదు. ప్రపంచంలోనే మానవ హక్కులను ఉల్లంఘించడంలో సంఖ్య రీత్యా, పద్దతుల రీత్యా కూడా మొదటి స్ధానంలో ఉండే అమెరికా తన కింద నలుపు కాదు కదా, ఒళ్ళంతా…

ఎంత పేదరికం ఉంటే పేదలైనట్లు?

భారత దేశంలో పేదలుగా పరిగణింపబడడానికి ఎంత పేదరికం ఉండాలి? ఈ ప్రశ్నకి సాధారణంగా ఎవరైనా చెప్పే సమాధానం, ఉండటానికి ఇల్లు, కడుపునిండా తిండి, వైద్యం చేయించుకోగల స్తోమత, గౌరవనీయంగా కనపడడానికి అవసరమైన బట్టి లేని వారు పేదవారని. కాని మార్కెట్ ఎకానమీ మిత్రుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా నాయకత్వంలోని ప్రణాళికా సంఘం దృష్టిలో భారత దేశంలోని పేదల లక్షణాలు అంతకంటే ఘోరంగా ఉండాలి. భారత దేశంలో ఇప్పటికీ అనేక మంది ఆకలి బారినపడి చనిపోతున్నారు. మలేరియా లాంటి…

స్ట్రాస్ కాన్ ఉదంతంతో రూల్స్‌ని సవరించుకున్న ఐ.ఎం.ఎఫ్

న్యూయార్క్ లోని ఓ లగ్జరీ హోటల్ లో ఐ.ఎం.ఎఫ్ మాజీ అధ్యక్షుడు హొటల్ మహిలా వర్కర్ పై రేప్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐ.ఎం.ఎఫ్ మహిళా హింసకు సంబంధించిన నిబంధనల్లో కొన్ని కార్పులు చేసుకుంది. కొత్త రూల్ ప్రకారం మహిళలను హింస (harassment) కు గురిచేసినట్లయితే క్రమశిక్షణా చర్య తీసుకోవడంతో పాటు ఉద్యోగం నుండి  కుడా తొలగించవచ్చు. మే 6 న ఆమోదం పొందిన నిబంధనల సమీక్షను గురువారం వెల్లడించారు. 2008 సంవత్సరంలో స్ట్రాస్ కాన్…

అమెరికా ఇప్పుడు టాప్‌లో ఉన్న 1 శాతం ధనికులదే -నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్ -2

అమెరికాలో పెరుగుతున్న అసమానతలను పూర్తిగా ఎలా వివరించాలో ఆర్ధిక పండితులకు అర్ధం కావడం లేదు. సరఫరా డిమాండ్ లకు సంబంధించిన సాధారణ అంశాలు పని చేశాయన్నది నిజమే. శ్రామికులు అవసరంలేని సాంకేతిక పరిజ్ఞానం “మంచి” మధ్యతరగతి వారికి, బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఉన్న డిమాండ్‌ను బాగా తగ్గించివేశాయి. ప్రపంచీకరణ ప్రపంచ వ్యాపిత మార్కెట్ ను సాధ్యం చేసింది. ఫలితంగా అమెరికాలోని ఖరీదైన నైపుణ్య రహిత కార్మికుల బదులు తక్కువ వేతనాలకు లభ్యమయ్యే విదేశీ నైపుణ్య రహిత కార్మికులు…

ఇండియాలో దరిద్రుల సంఖ్య లెక్కింపుకు ప్రభుత్వ నిర్ణయం

భారత దేశంలోని 120 కోట్లమంది ప్రజల్లో దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నవారు ఎంతమంది? ఈ ప్రశ్నకు అనేక జవాబులు ఉన్నాయి. ప్రభుత్వం 37 శాతం మంది దరిద్రులని చెబుతుంటే స్వతంత్ర అధ్యయనాల్లో ఒకటి 77 శాతం అని తెలిపింది. ఓ వ్యక్తి దరిద్రంలో ఉన్నాడు అని నిర్ధారించడానికి ఏర్పరిచిన ప్రాతిపదికల వలన ఇన్ని తేడాలు. ప్రభుత్వాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి జీవనాధారాలు కల్పించి వారి పరిస్ధితులను మెరుగుపరచడం ద్వారా దరిద్రుల సంఖ్యని తగ్గించడానికి బదులు…

స్ట్రాస్ కాన్‌పై లైంగిక ఆరోపణల్ని నమ్మని ఫ్రాన్సు దేశీయులు

లైంగిక ఆరోపణల్ని ఎదుర్కోంటున్న ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు డొమినిక్ స్ట్రాస్ కాన్ కి స్వదేశంలో గట్టి మద్దతు లభిస్తోంది. ఫ్రాన్సు ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్ సర్కోజి 2012 ఎన్నికల్లో పోటి చేయాలని భావిస్తున్నాడు. ఆయన అప్రూవల్ రేటింగా బాగా పడిపోయి ఉంది. అతని పై సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా కాన్ పోటీచేస్తాడని అందరూ భావిస్తున్న దశలో తాజా ఘటన జరిగింది. అధ్యక్ష అభ్యర్ధిగా కాన్ అప్రూవల్ రేటింగ్ అందరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆయన ఇంకా తన అభ్యర్దిత్వాన్ని…

కటకటాల కాన్

డొమినిక్ స్ట్రాస్ కాన్. మొన్నటివరకూ సంక్షోభాల్లో ఉన్న అర్ధిక వ్యవస్ధలకు బిలియన్ల డాలర్ల అప్పుల సాయం ఇవ్వడానికి నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తివంతుడు. ప్రపంచ ఆర్ధిక సంక్షొభం పరిష్కారానికి జి-20 దేశాల కూటమితో కలిసి నిరంతరం కృషి చేసి సంక్షోభంలో ఉన్న మహా మహా దేశాలను ఓ ఒడ్డుకి చేర్చడానికి దోహద పడిన మేధావి. చైనా కరెన్సీ యువాన్ విలువ పెంచాల్సిందేనని ఒత్తిడి తెచ్చి పశ్చిమ దేశాల వాదనలకు దన్నుగా నిలబడిన ధ్వజ స్తంభం. అప్పు సంక్షోభంలో కూరుకుపోయిన…

మసీదు-మందిరం తీర్పుని సస్పెండ్ చేసిన సుప్రీం కోర్టు

వివాదాస్పద బాబ్రీ మసీదు, రామ జన్మ భూమి స్ధలాన్ని మూడు భాగాలు చేసి పంచిన అలహాబాద్ హై కోర్టు తీర్పును సుప్రీం కోర్టు సస్పెన్షన్‌లో ఉంచింది. మూడు భాగాలుగా పంచడం వెనక హై కోర్టు ఇచ్చిన కారణాలను ఇద్దరు సభ్యులు గల సుప్రీం బెంచ్ ప్రశ్నించింది. బాబరు నిర్మించాడని చెబుతున్న మసీదును ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి నిర్మించినట్లుగా ఆరోపిస్తూ 1992 డిసెంబరు 6 తేదీన హిందూ మత సంస్ధలకు చెందిన కార్యకర్తలు కూల్చివేశిన విషయం విదితమే.…

ఒసామా ఓ సీరియస్ విద్యార్ధి -తైవానీస్ జుడో కోచ్ జిమ్మీ వూ

“ఒసామా నేను కోచింగ్ ఇచ్చిన విద్యార్ధుల్లో ప్రత్యేక విద్యార్ధి. అతని ఎత్తువలన ప్రత్యేకం అని చెప్పడం లేదు. అతని సీరియస్‌నెస్, అతని కన్సర్వేటివ్ భావాలు అతన్ని ప్రత్యేకంగా నిలిపాయి” అని ఒసామాకు విద్యార్ధి దశలో జుడో కోచింగ్ ఇచ్చాడని భావిస్తున్న జిమ్ వూ రాయిటర్స్ కి ఇచ్చిన ఇంటర్వూలే చెప్పాడు. అప్పటి ఒసామాయే ఇప్పటి ఒసామా బిన్ లాడెన్ అని నిర్ధారించలేక పోతున్నట్లుగా రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. తాయిచుంగ్ నగరంలో జరుగుతున్న జుడో టోర్నమెంటు సందర్భంగా…

డేటా దొంగతనంలో గూగుల్‌, సౌత్ కొరియా పోలీసుల విచారణ

పశ్చిమ దేశాల్లో ఐదారు సంవత్సరాల నుండి యూజర్ల డేటా దొంగిలిస్తూ అడ్డంగా దొరికిపోయిన గూగుల్ సంస్ధ తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదేపని చేస్తూ దొరికిపోయింది. మంగళ వారం దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని గూగుల్ ఆఫీసుపై పోలీసులు దాడి చేశారు. గూగుల్‌కి చెందిన మొబైల్ ప్రకటనల యూనిట్ ‘యాడ్‌మాబ్’, మొబైల్ వినియోగదారుల అనుమతి లేకుండా వారి లొకేషన్ వివరాలను సేకరించింది. యాడ్‌మాబ్ ను గూగుల్ గత సంవత్సరం కొనుగోలు చేసింది. ప్రపంచ సెర్చి మార్కెట్లో…

హాంకాంగ్‌లో మొట్టమొదటి సారిగా “కనీస వేతన చట్టం”

హాంకాంగ్‌లో మొదటిసారిగా కనీస వేతన చట్టం ప్రవేశపెట్టారు. 125 వ అంతర్జాతీయ కార్మిక దీక్షా దినోత్సవం రోజున హాంకాంగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌ను 1997 లో బ్రిటిష్ చేతినుండి చైనా ఆధీనంలోకి వచ్చింది. ప్రజాస్వామ్య బ్రిటన్ పాలనలో శ్రమ చేసే ప్రజలకు కనీస వేతన చట్టం లేకపోవడంతోటే బ్రిటన్‌కి ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న గౌరవం తెలుపుతోంది. ప్రజాస్వామ్య సంస్కరణలు అమలు చేయాలని ఈ బ్రిటన్ లాంటి దేశాలు చైనాను డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో,…

ఆసియా దేశాల ఆర్ధికాభివృద్ధికి ఆహారధరలు ఆటంకం -ఏడిబి

ఇప్పటివరకు అధిక వృద్ధి రేటును నమోదు చేస్తున్న ఆసియా దేశాల్లో పెరుగుతున్న ఆహార ధరల కారణంగా ఆర్ధికాభివృద్ధికి పెను సవాళ్ళు ఎదురు కానున్నాయని ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. ఆహార ధరలు అంతకంతకూ పెరుగుతు పోతుండడం వలన ఇప్పటికే బలహీనమైన కోలుగోలు శక్తితో దరిద్రం అనుభవిస్తున్న పేదల పరిస్ధితి మరింతగా దిగజారుతుందని ఎడిబి తెలిపింది. ఆహారం, ఇంధనం ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆసియా దేశాల జిడిపి కనీసం 1.5 శాతం మేర తగ్గే అవకాశం…