3-డి వీధి చిత్రం సిద్ధం, ఇదిగో ఇలా -వీడియో

“ఇంకొన్ని వీధి చిత్రాలు” అంటూ నేను ప్రచురించిన వీధి చిత్రాల పోస్టు కింద నేను, వేణు గారూ త్రి-డి చిత్రాలను ఎలా గీస్తారబ్బా అని ‘హ్యాశ్చర్యపడి’ పోయాం. అందులో ‘హాశ్చర్యపడ్డానికి’ ఏమీ లేదు అని మిత్రుడు కెవిన్ ఒక వీడియోని తన వ్యాఖ్యలో ప్రచురించారు. ఇందులో త్రి-డి చిత్రాలు మనకు అలా ఎందుకు కనిపిస్తాయో వివరణ ఉంది. కెవిన్ ఇచ్చిన వీడియోని పట్టుకొని వెళ్తే ఇదిగో, ఈ వీడియో కూడా కనపడింది. మా హాశ్చర్యాన్ని నివృత్తి చేసిన…

ఇంకొన్ని యూరోపియన్ వీధి చిత్రాలు -ఫొటోలు

యూరోపియన్ వీధి చిత్రాల్లో కనిపిస్తున్న త్రీ డైమెన్షనల్ ఎఫెక్టు చాలా అబ్బురపరిచే విధంగా ఉంటోంది. ఉదాహరణకి కింది ఫొటోల్లో ఎనిమిదవ ఫొటో చూడండి. ఆ బొమ్మ నిజానికి నేలపైన గీసిందే. బొమ్మ చివర స్త్రీ కూర్చుని ఉంది. కానీ చూస్తుంటే పులి నిజాంగా నిల్చుని ఉన్నట్లూ, స్త్రీ ఆ పులిపైన కూర్చుని ఉన్నట్లూ కనిపిస్తోంది. అలాగే పదకొండవ ఫొటో కూడా. ఇది నిజానికి సింపుల్ గా కనిపిస్తున్నప్పటికీ త్రీ-డి ఎఫెక్టు ఎలా వచ్చిందన్నదీ ఓ పట్టాన అర్ధం…

సాహస కేరళ నర్సులకు కన్నీటి వీడ్కోలు -ఫొటోలు

ఈ ఇద్దరు నర్సుల పేర్లు పి.కె.వినీత, రేమ్యా రంజన్. కోల్‌కతా లో అగ్ని ప్రమాదానికి గురైన ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రిలో వీరిరువురూ ప్రాణాలు కోల్పోయారు. వీరు నిజానికి చనిపోవలసిన అవసరం లేదు. ఆసుపత్రి యాజమాన్యం లాగానే తమ దారి తాము చూసుకున్నట్లయితే వీరు ఇప్పటికి శుభ్రంగా బతికి ఉండేవాళ్ళు. కాని వీరు తమ వృత్తి ధర్మాన్ని పాటించడానికే నిర్ణయించుకోవడంతో అగ్నిప్రమాదం వల్ల ఏర్పడిన దట్టమైన పొగ వల్ల ఊపిరాడక చనిపోయారు. ఎ.ఎం.ఆర్.ఐ అగ్నిప్రమాదంలో చనిపోయినవారిలో కాలిన గాయాలకంటే ఊపిరాడక…

అగ్నిమాపక విభాగం ముందే హెచ్చరించినా ఆసుపత్రి వాళ్ళు విన్లేదు -మమత

ఎ.ఎం.ఆర్.ఐ ఆసుపత్రి బేస్‌మెంట్ ను ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ అగ్నిమాపక విభాగం వాళ్ళు జులైలోనే హెచ్చరించారనీ, అయినా ఆసుపత్రి వాళ్ళు ఆ పని చేయలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పత్రికలకు తెలిపింది. రెండు నెలల్లో బేస్‌మెంట్ ఖాళీ చేస్తామని అఫిడవిట్ సమర్పించిన ఆసుపత్రి యాజమాన్యం అది చేయలేదని ఆమే తెలిపింది. ఆసుపత్రి యాజమాన్యం లాభాపేక్ష, నిర్లక్ష్యంగా ఫలితంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని నిస్సందేహంగా భావించవచ్చు. ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 88 కి…

కోల్‌కతా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, 73 మంది దుర్మరణం

కోల్‌కతా లో ఒక ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 73 మంది దుర్మరణ పాలయ్యారు. చనిపోయినవారిలో అధికులు రోగులే. ప్రమాదం జరిగినపుడు రోగులు నిద్రలో ఉండడంతో అధికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఏడంతస్ధుల భవనంలో పొగ దట్టంగా అలుముకోవడంతో అనేకమందికి ఊపిరాడలేదు. అగ్నిమాపక సిబ్బంది కిటికీలు బద్దలు కొట్టి నిచ్చెనలు ఉపయోగించి రోగులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి కొందరు రోగులను స్ట్రెచర్లలో ఉంచి బైటికి తెస్తున్నారు. బేస్‌మెంట్ లో మంటలు బయలుదేరి ఎ/సి షాఫ్టుల ద్వారా భవనం అంతా వ్యాపించినట్లు…

ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే……

ఆచారాలు, సంప్రదాయాలు భ్రష్టు పట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండకూడదు. ఇప్పుడు తిరుపతికి వెళ్తుంటే క్లబ్ కి వెళ్తున్నట్లుంది –చిన జీయరు స్వామి * * * * (………. …………. …………… ఎడిట్) చినజీయరు స్వామి గారు తిరుపతిని క్లబ్బుతో పోల్చకుండా ఉండవలసింది. ప్రభుత్వం తెస్తున్న మార్పులు అదనంగా వచ్చి చేరేవే తప్ప తిరుపతికి స్వతహాగా ప్రజల్లో ఉన్న గౌరవానికి భంగం కలిగించేవి కాదు. అందువలన ప్రజల మనసుల్లో గౌరవ స్ధానంలో ఉన్న తిరుపతిని క్లబ్బుతో…

యూరోపియన్ వీధి చిత్ర కళ -ఫొటోలు

యూరప్ లోని వివిధ దేశాల నుండి సేకరించిన వీధి చిత్రాలు ఇవి. ఎంత సృజనాత్మకంగా ఉన్నాయో చూడండి. త్రీ డైమెన్షనల్ చిత్ర కళ అందునా వీధుల్లో ప్రదర్శించడం, ప్రదర్శించి మెప్పించడం ఎంతో సులువుగా చేశారు వీళ్ళు. – –

ఇంటర్నెట్ సామాజిక వెబ్ సైట్లు స్వీయ నియంత్రణ పాటించాలి -కేంద్ర మంత్రి

గూగుల్, ఫేస్ బుక్, యాహూ, మైక్రో సాఫ్ట్ లాంటి ఇంటర్నెట్ సంస్ధలు, సామాజిక వెబ్ సైట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే అంశాల వల్ల ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండడానికి స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్ర సమాచార, ఐ.టి శాఖ మంత్రి కబిల్ సిబాల్ మంగళవారం కోరాడు. అనేక సంస్కృతులు, మతాలు ఉన్న భారత దేశంలో ఏ ఒక్కరి మనోభావాలు గాయపడకుండా ఇంటర్నెట్ సంస్ధలు జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరాడు. మంత్రి ప్రకటనకు ఇంటర్నెట్ సంస్ధలు వివిధ రకాలుగా స్పందించాయి.…

కుల దురాచారంపై ఫిర్యాదు చేసిన బి.సి నాయకుడ్ని చితకబాదిన అగ్ర కులస్ధులు

కర్ణాటకలో కుక్కె సుబ్రమణ్య దేవాలయంలో ఇప్పటికీ అమలులో ఉన్న కుల దురాచారానికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బి.సిల నాయకుడిని చావబాదిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల రక్షణలో ఉన్నప్పటికీ ఆయనకు చావు దెబ్బలు తప్పలేదు. ఆయన చేసిన పాపమల్లా ‘మాదె స్నాన’ అన్న పేరుతో సుబ్రమణ్య గుడిలో కొనసాగుతున్న దురాచారాన్ని ఆపాలని కోరడమే. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుబ్రమణ్య గుడి మంగుళూరు దగ్గరలో ఉన్న సుల్యా తాలూకాలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మూడు రోజుల…

నరేంద్ర మోడికి మరో లెంపకాయ, ‘ఇష్రాత్ జహాన్’ బూటకపు ఎన్‌కౌంటర్ పై సిబిఐ విచారణ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి కి వరుసగా లెంపకాయలు తగులుతూనే ఉన్నాయి. అయనకు లెంపకాయలు ఇచ్చినవాళ్ళలో తాజాగా గుజరాత్ హై కోర్టు చేరింది. ‘ఇష్రాత్ జహాన్’ తో పాటు ఆమె ముగ్గురు మిత్రులను బూటకపు ఎన్‌కౌంటర్ లో చంపిన నేరంపైన సి.బి.ఐ విచారణకు గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి బాధితుల్లో విశ్వాసం పాదుకొల్పడంలో విఫలమైనందున సి.బి.ఐ విచారణకు ఆదేశిస్తున్నట్లుగా హై కోర్టు పేర్కొంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (సిట్)…