అప్పు ఎగ్గొట్టిన పారిశ్రామికవేత్తల పేర్లు వెల్లడించండి, సమాచార కమిషనర్ సంచలనం

భారత పాలక పార్టీలన్నీ ఇన్నాళ్ళూ కాపాడుతూ వచ్చిన రహస్య సమాచారం ఒకటి, కొద్ది రోజుల్లో బట్టబయలు కానున్నది. ‘సమాచార హక్కు చట్టం’ అమలుకు ఉద్దేశించబడిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సి.ఐ.సి) ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తే బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బుల్ని అప్పనంగా కాజేసిన బడా భోక్తల పేర్లు త్వరలో వెల్లడి కానున్నాయి. భారత పబ్లిక్ రంగ బ్యాంకులనుండి అప్పులు తీసుకుని చెల్లించకుండా ఎగవేసిన పారిశ్రామిక వేత్తల పేర్లను ఆర్.బి.ఐ డిసెంబరు 31 లోగా పబ్లిక్ గా…