అసలు ఎస్ & పి విశ్వసనీయత ఎంత? తనదాకా వచ్చాక అడుగుతున్న అమెరికా

తనదాకా వస్తేగాని అర్ధం కాలేదు అమెరికాకి. ఒక దేశానికి చెందిన క్రెడిట్ రేటింగ్ తగ్గించడం అంటే ఏమిటో అమెరికా అధికారులకి, కాంగ్రెస్ సభ్యులకీ, సెనేట్ నాయకులకీ ఇప్పుడు అర్ధం అవుతోంది. అది కూడా పాక్షికంగానే. అమెరికా క్రెడిట్ రేటింగ్ తగ్గించాక మాత్రమే ఎస్ & పి కి ఉన్న విశ్వసనీయతపైన అమెరికాకి అనుమానాలు వస్తున్నాయి. యూరప్, ఆసియా లకు చెందిన అనేక బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలతో పాటు దేశాల సావరిన్ అప్పులకు కూడా రేటింగ్ లను…