సబిత, ధర్మానలను జైలుకి పంపండి -సి.బి.ఐ

రాష్ట్ర మాజీ హోమ్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుల పట్ల ఇన్నాళ్లూ అంటీ ముట్టనట్లు వ్యవహరించిన సి.బి.ఐ, శుక్రవారం అసాధారణ రీతిలో మెమోలు జారీ చేసింది. తాము నిర్దోషులుగా బైటికి వస్తామంటూ ఇద్దరు మాజీ మంత్రులు ప్రకటించిన దానిని గుర్తు చేస్తూ, వారిద్దరూ విచారణను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, కాబట్టి వెంటనే వారిని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని కోర్టును కోరింది. నిర్దోషులుగా బైటికి వస్తామని ప్రకటించడం అంటే ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం…

ధర్మాన, సబిత రాజీనామా చేసేశారు

కాంగ్రెస్ అవినీతి వ్యతిరేక నాటకంలో ఒక అంకం పూర్తయింది. ధర్మాన రాజీనామా తిరస్కరణను గతంలో ఆమోదించిన అధిష్టానమే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిందట! ధర్మానతో పాటు ‘కళంకిత మంత్రుల’ ఒకరయిన సబిత ఇంద్రారెడ్డి రాజీనామా కూడా తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఆదేశించిందట. ఈ విషయం ముఖ్యమంత్రి ద్వారా తెలుసుకున్న మంత్రులు ఇరువురు ఆయనను కలుసుకుని తమ రాజీనామా పత్రాలు అందజేశారని ది హిందు తెలిపింది. అయితే మంత్రుల రాజీనామా విషయం ఇంకా…

జగన్ కేసు: హోమ్ మంత్రి సబితను ఊరడించిన తోటి మంత్రులు!?

రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నట్టుండి కలకలం రేగింది. మంత్రులు ఆనం, బొత్సలు హడావుడిగా సమావేశాలు జరుపుతుంటే టి.వి చానెళ్లు, పత్రికల విలేఖరులు వారేమి చెప్పబోతున్నారా అని ఉత్కంఠగా ఎదురు చూశారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఐదవ చార్జి షీటు దాఖలు చేసిన సి.బి.ఐ అందులో నాలుగో నిందితురాలిగా (A4) పేర్కొనడం దీనికి కారణం. మార్చి 31 లోపు విచారణ పూర్తి చేస్తామని చెప్పిన సి.బి.ఐ అలా చెయ్యకపోగా మరో చార్జి…