శవ పేటికలే చర్చల బల్లలుగా… -కార్టూన్
మొట్ట మొదటి బి.జె.పి ప్రధాని అతల్ బిహారీ వాజ్ పేయి కాలంలోనే భారత్-పాకిస్ధాన్ ల మధ్య ద్వైపాక్షిక చర్చలు నిర్మాణాత్మక దృష్టితో ప్రారంభం అయ్యాయని పత్రికలు తరచూ చెబుతుంటాయి. అక్కడ మిలట్రీ పాలకుడు ముషార్రాఫ్, ఇక్కడ మొట్టమొదటి మితవాద ప్రభుత్వం రెండు దేశాల్ని నడుపుతుండగా ప్రారంభమైన చర్చలు వాణిజ్య సంబంధాల్లోకి ప్రవేశించి ఊపందుకుంటున్న సమయంలోనే ముంబై టెర్రరిస్టు దాడుల ఫలితంగా అటకెక్కాయి. అప్పటి నుండి వివిధ సంఘటనలు, దుర్ఘటనల సాకు చూపుతూ రెండు దేశాలు దూరం జరుగుతూ…