2011లో 25 శాతం పతనమైన భారత షేర్లు, సంస్కరణల కోసం భారత పాలకులపై ఒత్తిడి

భారత షేర్ మార్కెట్లకు 2011 సంవత్సరం నిరాశనే మిగిల్చింది. ప్రపంచంలో మరే దేశమూ నష్టపోనంతగా బి.ఎస్.ఇ సెన్సెక్స్ షేర్ సూచి ఈ సంవత్సరం 24.6 శాతం నష్టపోయింది. ఈ సంవత్సరం చివరి వ్యాపార దినం అయిన శుక్రవారం రోజు కూడా బి.ఎస్.ఇ సెన్సెక్స్ 0.6 శాతం నష్టపోయింది. సంవత్సరం పొడవునా ద్రవ్యోల్బణం రెండంకెలకు దగ్గరగా కొనసాగడం, ద్రవ్యోల్బణం అరికట్టడానికని చెబుతూ ఆర్.బి.ఐ అధిక వడ్డీ రేట్లు కొనసాగించడం, ఆర్ధిక వృద్ధి అనూహ్యంగా నెమ్మదించడం కారణాల వల్ల భారత…