సంక్షోభ పరిస్ధితుల్లో దిక్కు తోచని సంపన్నులు

యూరప్ రుణ సంక్షోభం, అమెరికా ఆర్ధిక వృద్ధి స్తంభనలు ప్రపంచ సంపన్నులను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. తమ సంపదలను ఎక్కడ మదుపు చేస్తే క్షేమంగా ఉంటుందో అంచనా వేయలేక సతమతమవుతున్నారు. ఎల్లప్పుడూ తమ సంపదలను వృద్ధి చేసుకోవడానికి ఎత్తులు పైఎత్తులలో మునిగి తేలుతూ ఉండే వాళ్ళు ఇప్పుడు వృద్ధి సంగతి అటుంచి అవి తరిగిపోకుండా ఉండడానికి గల మార్గాలను వెతుక్కుంటున్నారు. కొందరు అప్పుడే వినాశకకర పరిస్ధితులో పెట్టుబడులను ఎక్కడికి తరలిస్తారో గమనించి అటువంటి చోట్లను వెతుకులాడుతున్నారు. డబ్బు…