రాజీనామాకి యెడ్యూరప్ప షరతులు, కర్ణాటక బి.జె.పిలో ప్రతిష్టంభన
కర్ణాటక ముఖ్యమంత్రి తనపై లోకాయుక్త నివేదికలో అక్రమ మైనింగ్ కుంభకోణంలో భాగస్వామ్యం వహించిన ఆరోపణలు చేయడంతో హైకమాండ్ ఆదేశాల మేరకు రాజీనామా చేస్తానని యెడ్యూరప్ప అంగీకరించినా, తీరా కేంద్ర పరిశీలకులు వచ్చాక మొండికేశాడు. కొన్ని షరతులు విధించి అవి నెరవేరితేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. తన మద్దతుదారులను పెద్ద సంఖ్యంలో తన అధికారిక నివాసం వద్దకు పిలిపించుకుని వారి చేత ఆందోళన చేయిస్తునాడు. యెడ్యూరప్పను కొనసాగనివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనితో కర్ణాటక వచ్చిన కేంద్ర బృందం…