మోడి & అమిత్ షా: ఇక పనిలోకి దిగుదాం! -కార్టూన్
కొత్త ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తోడనే గుజరాత్ లో సంచలన కేసుల కధలు ఒక్కొక్కటీ కంచికి ప్రయాణం కడుతున్నాయి. ఆయా కేసుల్లో నిందితులకు గౌరవ మర్యాదలతో పదవులు దక్కుతున్నాయి. షోరాబుద్దీన్ షేక్ (మరియు) ఆయన భార్య ఎన్ కౌంటర్, ఇష్రత్ జహాన్ (మరియు మరో ముగ్గురు ముస్లిం యువకులు) ఎన్ కౌంటర్, తులసీరాం ప్రజాపతి హత్య తదితర కేసుల్లో నిందితులైన ఐ.పి.ఎస్ అధికారులు ఇద్దరిని సగౌరవంగా తిరిగి పదవులు కట్టబెట్టారు. ఆషామాషీ పదవులు కాకుండా శక్తివంతమైన…
