గ్రీసు బెయిలౌట్‌తో పట్టపగ్గాలు లేని ఇండియా షేర్‌మార్కెట్లు
అప్పు సంక్షోభంతో సతమతమవుతున్న గ్రీసు దేశానికి రెండో బెయిలౌట్ ఇవ్వనున్నట్లు ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ప్రకటించడంతో భారత షేర్ మార్కెట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. బి.ఎస్.ఇ సెన్సెక్స్, ఎన్.ఎస్.ఇ నిఫ్టీలు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా మూడు శాతం వరకూ లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతుండడంతో ప్రపంచ వ్యాపితంగా మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇండియా ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో మందగించినట్లు…