జపాన్ ను వణికించిన భారీ భూకంపం, ముంచెత్తిన సునామీ

[అప్ డేట్: జపాన్ సునామీలో మరణించిన వారి సంఖ్య: 300 దాటింది] జపాన్ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి సమీపంలో సమద్ర గర్బాన భారీ భూకంపం సంభవించింది. సముద్ర గర్బాన భూకంపం సంభవించడం వలన అది భారీ సునామీగా పరిణమించి జపాన్ తీరప్రాంతాన్ని ముంచెత్తింది. రిక్టర్ స్కేల్ పై 8.9 గా నమోదైన ఈ భూకంపం, జపాన్ లో 140 సంవత్సరాల క్రితం భూకంపం రికార్డులు నమోదు చేయడం ప్రారంభించినప్పటి నుండి అత్యంత భారీ భూకంపంగా జపాన్ తెలిపింది.…

గరిష్ట స్ధాయికి ఆయిల్ ధరలు, షేర్ మార్కెట్ కు భారీ నష్టాలు

  ఇండియా షేర్ మార్కెట్లు గురువారం భారీ స్ధాయిలో నష్ట పోయాయి. అసలే అధిక ద్రవ్యోల్బణం, వరుసగా చుట్టుముడుతున్న అవినీతి ఆరోపణల కారణంగా కొత్త సంవత్సరం ప్రారంభం నుండీ ఒడిదుడుకులకు లోనవుతున్న భారత షేర్లు లిబియా ఆందోళనలు ఆశనిపాతంగా పరిణమించాయి. పదహారు నెలల గరిష్ట స్ధాయిలో నష్టాలను నమోదు చేశాయి. బోంబే స్టాక్ ఎక్ఛేంజ్ 546 పాయింట్లు (3 శాతం) నష్టపోయి 17,632 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ 175 పాయింట్లు (3.2…

రెండో రోజూ కొనసాగిన ఇండియా షేర్ల పతనం, ఆశలన్నీ బడ్జెట్ పైనే

సోమవారం లాభాల్లో ముగిసిన ఇండియా షేర్ మార్కెట్లు మంగళ, బుధ వారాల్లో మళ్ళీ నష్టాల బాట పట్టాయి. ఇటీవలి వరకూ ఈజిప్టు ఆందోళనలు ప్రపంచ షేర్ మార్కెట్లపై ప్రభావం చూపగా ప్రస్తుతం లిబియా పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. ప్రజాందోళనలు ఆయిల్ ఉత్పత్తి చేసే ఇతర దేశాలకు సైతం విస్తరించవచ్చనే భయం నెలకొనడంతో ఆయిల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. దానితో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో బ్యాంకుల షేర్లు మార్కెట్ పతనానికి దోహదం చేశాయి. 30 షేర్ల…

కలైజ్గ్నర్ టీ.వి ఛానల్ కార్యాలయంపై సి.బి.ఐ దాడి, షేర్ మార్కెట్ పతనం

  తమిళనాడులో అధికార పార్టీగా ఉన్న డి.ఎం.కె పార్టీ అధినేత కరుణానిది కుటుంబానికి చెందిన కలైజ్గ్నర్ టీ.వి చానల్ కార్యాలయాలపై శుక్రవారం సి.బి.ఐ దాడులు నిర్వహించింది. 2-జి స్పెక్ట్రం స్కాముకు సంబంధించి లైసెన్సు పొందిన టెలి కంపెనీల్లో ఒకటైన స్వాన్ టెలికం సంస్ధ లైసెన్సు పొందటం కోసం టి.వి ఛానెల్ కు 47 మిలియన్ డాలర్లు (దాదాపు 214 కోట్ల రూపాయలు) ముడుపులుగా చెల్లించినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. సి.బి.ఐ దాడులు జరిగిన…

శతృవుల పుకార్లతో మా కంపెనీల షేర్లు పడిపోతున్నాయ్ -అనీల్ అంబానీ

మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.   కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో…