సిరియాపై క్షిపణి దాడి వార్తలు; రూపాయి, షేర్లు పతనం
సిరియాపై అమెరికా క్షిపణి దాడి చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అమెరికా, సిరియాపై రెండు క్షిపణులతో దాడి చేసిందనీ, ఈ దాడి ఫలితంగా సిరియా రాజధాని డమాస్కస్ లో 50 మంది వరకూ చనిపోయారనీ వార్తలు షికారు చేస్తున్నాయి. తెలుగు టి.వి ఛానెళ్లు ఈ వార్తను ఎక్కడినుండి సంపాదించాయో గానీ ఈ రోజు మధ్యాహ్నం నుండి స్క్రోలింగ్ లో చూపాయి. అయితే ఇందులో నిజం లేదని
