హసీనాపై ఒత్తిడి వద్దు- అమెరికాకు ఇండియా విజ్ఞప్తి!

బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని భారత అధికారులు అమెరికన్ విదేశీ వ్యవహారాల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారని ‘బిజినెస్ టుడే’ పత్రిక వెల్లడి చేసింది. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు పారిపోవటానికి సంవత్సరం ముందు నుండే ఇండియా, హసీనా పట్ల తేలికగా వ్యవహరించాలని, అమెరికాను కోరిందని ది వాషింగ్టన్ పోస్ట్ పత్రికను ఉటంకిస్తూ బిజినెస్ టుడే పత్రిక వెల్లడి చేసింది. బంగ్లాదేశ్ లోని హసీనా ప్రభుత్వం…

బంగ్లాదేశ్ ఉద్యోగాల రిజర్వేషన్ గురించి…

జనవరి 2024 లో జరిగిన ఎన్నికల్లో ఆవామీ లీగ్ పార్టీ విజయం సాధించడంతో బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా నాలుగవ సారి పదవి చేపట్టిన షేక్ హసీనా మరో 6 నెలల్లోనే పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు కోరవలసి వచ్చింది. 15 యేళ్ళ పాటు అవిచ్ఛిన్నంగా ప్రజాస్వామ్య వాసనలు లేకుండా దాదాపు డిక్టేటర్ తరహాలో బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనా ప్రస్తుత పరిస్ధితి స్వయంకృతాపరాధమే అని ది హిందూ లాంటి పత్రికలు వ్యాఖ్యానించాయి. ఈ పరిశీలనలో…

అమెరికా ప్రతీకారమే నా పదవీచ్యుతి -హసీనా

St. Martin Island in North-Eastern Bay of Bengal విద్యార్ధులు, ప్రతిపక్ష పార్టీలు, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ సంస్థల హింసాత్మక ఆందోళనల ఫలితంగా బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఇండియాలో శరణు వేడిన మాజీ ప్రధాని షేక్ హసీనా, అసలు గుట్టును బట్టబయలు చేసిందని రష్యా టుడే పత్రిక తెలియజేసింది. బంగ్లాదేశ్ ద్వీపాన్ని సైనిక స్థావరం నిర్మించేందుకు లీజుకు ఇచ్చేందుకు నిరాకరించినందు వల్లనే అమెరికా ఇప్పుడు తనపై ప్రతీకారం తీర్చుకుందని షేక్ హసీనా కుండ…

మా శత్రువుకు సాయం చేస్తే సహకారం ఉండదు, ఇండియాకు బి.ఎన్.పి హెచ్చరిక!

బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన ‘బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ’ ఇండియాకు హెచ్చరిక జారీ చేసింది. “మా శత్రువు (షేక్ హసీనా) కు సహాయం చేస్తే మీతో సహకారం కొనసాగించడం కష్టం అవుతుంది” అని బి.ఎన్.పి పార్టీ ఇండియాను గట్టిగా హెచ్చరించింది. ఈ మేరకు బి.ఎన్.పి పార్టీ ప్రతినిధి మరియు బంగ్లాదేశ్ మాజీ మంత్రి గయేశ్వర్ రాయ్, హెచ్చరించాడు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు ఇండియాలో రక్షణ కల్పించడం ఆ దేశ ప్రతిపక్ష పార్టీ బి.ఎన్.పి…

బంగ్లా సంక్షోభం, అమెరికా పుణ్యం!

Awami League Leader and Ousted PM Shaik Hasina జనవరి 2024 ఎన్నికల్లో 4వ సారి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రిగా ఎన్నికయిన అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా సోమవారం ఆగస్టు 5 తేదీన అక్కడి మిలటరీ సమకూర్చిన హెలికాప్టర్ లో ఇండియాకు పారిపోయి రావడంతో భారత ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. జులై 1 తేదీ నుండి బంగ్లా దేశ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నప్పటికీ పరిస్ధితి ఇంతటి తీవ్ర పరిణామాలకు…