ఢిల్లీ అసెంబ్లీ: కాంగ్రెస్ కి షీలా షాక్!

కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ ఈ రోజు (సెప్టెంబర్ 11, 2014) రాజకీయ పరిశీలకులను, పత్రికలను, ఢిల్లీ ప్రజలను నిశ్చేష్టులను కావించారు. ఢిల్లీలో బి.జె.పి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది ఢిల్లీ ప్రజలకు మంచిదే అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ప్రకటనతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించగా, కాంగ్రెస్-బి.జె.పి లకు అసలు తేడాయే లేదని చెప్పాం గదా! అని ఎఎపి వ్యాఖ్యానించింది. “ప్రజాస్వామ్యంలో,…

షీలా ఇంటికి 31 ఏ.సిలు! -కార్టూన్

“బహుశా ఆమె ఢిల్లీ మొత్తాన్ని చల్లగా ఉంచాలని భావించి ఉంటారు!” ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ అధికారిక నివాసానికి ఏకంగా 31 ఏ.సి మిషన్లు అమర్చారట. పోనీ అంతటితో ఆగారా అంటే, లేదు. 31 ఏ.సిలతో పాటు 15 ఎయిర్ కూలర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 14 హీటర్లు కూడా షీలా ఇంటిలో అమర్చారు. ఇంతా చేసి ఆ ఇల్లు 4 పడక గదుల ఇల్లు. నాలుగు పడకగదుల ఇంట్లో ఇన్ని ఏ.సిలు, ఎయిర్ కూలర్లు…

ఎఎపి పాలన: షీలా అవినీతిపై విచారణ!

బైటి నుండి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పైకి ఢిల్లీ ప్రభుత్వం మరో అస్త్రం సంధించింది. కామన్ వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వివిధ నిర్మాణాల్లోని అవినీతిని విచారించాలని రాష్ట్ర ఎ.సి.బిని ఆదేశించింది. సాధారణంగా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలను సంతృప్తిపరచడానికీ, వారు అలిగినప్పుడు ప్రసన్నం చేసుకోవడానికీ, వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికి పాలక పార్టీలు నానా అగచాట్లు పడుతుంటాయి. కానీ ఎఎపి పార్టీ ఈ విషయంలోనూ ‘నేను తేడా’ అని చెబుతోంది. 2010లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్…

మృ(మ)గత్వాన్ని ధిక్కరించి, రాజ్యాధిపత్యాన్ని వణికించిన సాహసి ఇక లేదు

యావత్భారతదేశాన్ని అశ్రుధారల్లో ముంచుతూ ఆ సాహసిక యువతి తుదిశ్వాస విడిచింది. క్రూర మృగాలు సైతం సిగ్గుపడేలా ఆరుగురు మగవాళ్ళు అత్యంత హేయమైన రీతిలో ఆడిన పాశవిక మృత్యుక్రీడలో ఆమె ఆవిసిపోయి సెలవు తీసుకుంది. శరీరాన్ని నిలిపి ఉంచే వివిధ అవయవాలు విషతుల్యమైన రక్తం ధాటికి ఒక్కొక్కటీ కూలి సోలిపోగా కుటుంబసభ్యుల మధ్యా, పేరు మోసిన వైద్యుల మధ్యా శాశ్వతంగా కన్నుమూసింది. పోతూ పోతూ అభివృద్ధి సాధించామని చెప్పుకుంటున్న నాగరీక మానవుల మానవత్వాన్ని పరిహసించి పోయిందామె. “ఆమెను బతికించడానికి…

బాధితురాలి స్టేట్‌మెంట్‌ని మార్చడానికి ఢిల్లీ పోలీసుల కుయత్నం?

ఢిల్లీ సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్.డి.ఎం) ముందు సామూహిక అత్యాచారం బాధితురాలు ఏమి జరిగిందీ తెలియజేసింది. ఎస్.డి.ఎం ముందు బాధితురాలు అమానత్ (అసలు పేరు కాదు) ఏమి చెప్పిందీ సౌత్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డి.సి.పి) ఛాయా శర్మ క్లుప్తంగా పత్రికలకు తెలిపింది. ఆమె ప్రకారం ఆ రోజు రాత్రి దాదాపు 9:30 గంటలకు అమానత్ తన ఫ్రెండ్ తో కలిసి మునిర్కాలో బస్ స్టాప్ వద్ద నిలబడి ఉన్నారు. బస్సులో ఉన్న మైనర్…