ఎఎపిలో లుకలుకలు, ఎ.కె అరెస్టుతో గట్టెక్కే ప్రయత్నం!
సాధారణ ఎన్నికలు ముగియడంతో ఓటమి చెందిన పార్టీలు కాసింత సంక్షోభానికి లోను కావడం మామూలే. అయితే అది సాధారణ, సాంప్రదాయ పార్టీలకు సంబంధించిన వ్యవహారం. అక్కడ స్వార్ధ ప్రయోజనాల కోసమే చేరికలు, దూకుళ్ళు ఉంటాయి. కానీ ఆం ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కాదు లేదా కనీసం ఆ పార్టీ నాయకులు అలా చెబుతారు. అద్భుతాలేమీ సృష్టించకపోయినా కనీసం గణనీయ మొత్తంలోనయినా లోక్ సభ సీట్లు సాధిస్తుందని అంచనా వేసిన ఎఎపి కేవలం 4 సీట్లు మాత్రమే…
