కేంద్ర మంత్రి జైస్వాల్ కి ముసలి భార్యపై మోజు తగ్గిందట!
కేంద్ర బొగ్గు మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్ తానింకా ప్రాచీన యుగాల్లోనే మగ్గుతున్నానని చెప్పుకున్నాడు. వివాహ బంధాన్ని క్రికెట్ మ్యాచ్ తోనూ, భార్యలని కాలక్రమేణా మోజు తగ్గిపోయే విజయాలతోనూ పోల్చి తన ఫ్యూడల్ బుద్ధి చాటుకున్నాడు. వయసు పెరిగిన భార్యలపై మోజు కోల్పోయే పురుష పుంగవుల వక్రబుద్ధికి ఆమోద ముద్ర వేసేశాడు. భార్య అంటే మనసు, మెదడు, వ్యక్తిత్వం ఉన్న స్త్రీ కాదనీ, కేవలం మగ శరీరాలకి సుఖాల్ని పంచే మాంసపు ముద్దలేననీ ‘మనసులో మాట’ బయట పెట్టాడు.…
