ఇటలీ అమెరికా సంబంధాలను దెబ్బతీసిన ఇండియా శాటిలైట్ ప్రయోగం -వికీలీక్స్
ఇండియాలో మానవ నిర్మిత ఉపగ్రహాన్ని (శాటిలైట్) ప్రయోగిస్తే అది ఇటలీ, అమెరికాల సంబంధాలను సంవత్సరం పాటు వేడెక్కించింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా ఇటలీ అమెరికాల సంబంధాల బలం ఇండియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రం శ్రీహరి కోట లో నిక్షిప్తం అయి ఉండటం నిజంగా ఆశ్చర్యకరమే. ఇటలీలోని అమెరికా రాయబారి అమెరికా ప్రభుత్వానికీ, ఇండియాలోని అమెరికా రాయబారికీ మే 26, 2007 తేదీన పంపిన కేబుల్ లో ఈ వివరాలు ఉన్నాయి. ఏప్రిల్ 23, 2007…