శ్రీలంక కిల్లింగ్ ఫీల్డ్స్, ఈ దారుణాలు చూడగలరా? -ఫొటోలు

సాటి మనుషుల్ని ఇంత పైశాచికంగా హింసించడం ‘మనిషి’ గా చచ్చిపోతే తప్ప సాధ్యం కాదు. ‘క్లినికల్లీ డెడ్’ లాగా ‘హ్యూమన్లీ డెడ్’ లాంటి ఓ కొత్త పదం కనిపెడితే తప్ప శ్రీలంక సైనికుల ఘోర కృత్యాలను వర్ణించలేము. శ్రీలంక లో సింహళుల జాతి వివక్షను వ్యతిరేకిస్తూ ఎల్.టి.టి.ఇ ప్రారంభించిన యుద్ధం ‘ప్రత్యేక ఈలం’ ను డిమాండ్ చేసేవరకూ వెళ్లింది. రెండు దశాబ్దాల పాటు సాగిన వారి ఘర్షణలో శ్రీలంక సైన్యం 2009 లో పై చేయి సాధించడంతో…

శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…