చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు
– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…