శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా

శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…

శ్రీలంక ఆటగాళ్లు ఐ.పి.ఎల్ ఆడొద్దు –రావణ ఫోర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐదో అంచె టోర్నమెంటులో చెన్నైలో జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లను ఆడనివ్వరాదని ఐ.పి.ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం శ్రీలంకలో వాతావరణాన్ని వేడెక్కించింది. శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఐ.పి.ఎల్ లో ఆడకుండా తగిన చర్యలు తీసుకోవాలని వివిధ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఆటగాళ్లను ఆపే అధికారం తమకు లేదని శ్రీలంక క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. శ్రీలంకకు చెందిన బుద్ధిస్టు జాతీయ గ్రూపులు ఐ.పి.ఎల్ లో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లు ఆడకుండా…

శ్రీలంకతో ఎన్నికల యుద్ధం ప్రాక్టీస్ -కార్టూన్

శ్రీలంక తమిళుల దుర్భర పరిస్ధితులపై తమిళనాడులో అక్కడి రాజకీయ పార్టీలు భావోద్వేగాలు రెచ్చగొట్టి పెట్టాయి. శ్రీలంక ప్రభుత్వం సాగించిన యుద్ధ నేరాలపై అమెరికా ఐరాస మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించడం పార్టీలకు వాటంగా కలిసి వచ్చింది. యుపిఎ ప్రభుత్వానికి డిఎంకె మద్దతు ఉపసంహరించుకోవడంతో పార్టీల నాటకం రక్తి కట్టింది. ఐ.పి.ఎల్ ఆటలకు శ్రీలంక ఆటగాళ్లను అనుమతించేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి హుంకరించడంతో రక్తి కట్టిన నాటకం కాస్తా రసాభాసగా మారిపోయింది. ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధంగా…

తెరచాప కడితే హెలికాప్టర్ ఎగురుతుందా? -కార్టూన్

దేశాల విదేశాంగ విధానాలకు ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉండాలి. అందులో సందేహం లేదు. కానీ ప్రజల ప్రయోజనాలు ఏమిటన్నదీ సంకుచిత, స్వల్పకాలిక స్వార్ధ పూరిత ఎత్తుగడలు నిర్ణయించరాదని ఈ కార్టూన్ లో ‘ది హిందూ‘ కార్టూనిస్టు కేశవ్ చెబుతున్నారు. బహుశా శ్రీలంక మానవ హక్కుల తీర్మానం, కాశ్మీరులో భారత్-పాక్ సైనికుల ఘర్షణలు, (ఇటలీ మెరైన్ల వ్యవహారం కూడానా?) కార్టూనిస్టు దృష్టిలో ఉన్నాయనుకుంటాను. ఎల్.టి.టి.ఇ తో పోరాటం గెలిచిన చివరి రోజుల్లో శ్రీలంక సైన్యం తమిళ…

ఐరాస మానవ హక్కుల ఓటుకు భారత్ పై శ్రీలంక ప్రతీకారం

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ (United Nations Human Rights Council – UNHRC) లో గురువారం జరిగిన ఓటింగులో శ్రీలంకకు వ్యతిరేకంగా భారత దేశం వేసిన ఓటు శ్రీలంకలో ‘ఇండియన్ ఆయిల్ కంపెనీ‘ (ఐఒసి) వాణిజ్య ప్రయోజనాలకు చేటు తెచ్చిపెట్టింది. ట్రింకోమలిలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న 99 ట్యాంకుల ఆయిల్ గిడ్డంగి లోని ట్యాంకులను పాక్షికంగా తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందని పిటిఐ తెలిపింది. ఇండియన్ ఆయిల్ కంపెనీ, భారత ప్రభుత్వ…

చైనా, శ్రీలంకల అంతరిక్ష సహకారంతో భారత్ కంగారు

– వివిధ రంగాల్లో చైనా, శ్రీలంక దేశాల మధ్య పెరుగుతున్న సహకారం భారత పాలకులకు (ప్రజలకు కాదు) ఆందోళన కలిగిస్తోంది. భారత్ ని విస్మరిస్తూ శ్రీలంక, చైనాతో సహకార సంబంధాలు పెంపొందించుకోవడం ముఖ్యంగా భారత భద్రతా వ్యవస్థలను ఠారెత్తిస్తోంది. అది కూడా కీలకమైన వ్యూహాత్మక రంగాలలో ఈ సహకారం కొంత పుంతలు తొక్కడం మరింత కంగారు పుట్టిస్తోంది. శ్రీలంకలో భారత ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం వచ్చేవారం వివిధ మంత్రిత్వ శాఖల సమావేశం (inter-ministerial meeting) జరపాలని భారత…

శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా

శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…