శ్రీలంక: సాయంలో కోత పెట్టిన అమెరికా
శ్రీలంకకు ఇస్తున్న సహాయంలో అమెరికా కోత విధించింది. మానవ హక్కుల హరణ, మిలట్రీ జోక్యం వల్ల కోత విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ప్రతినిధి చెప్పినట్లు పి.టి.ఐ తెలిపింది. ఎల్.టి.టి.ఇ యుద్ధం ముగిసిన తర్వాత ఉత్తరాన నివశిస్తున్న తమిళులకు పౌరహక్కులు కల్పించడంలోనూ, నాశనం అయిన నిర్మాణాలను పునర్నిర్మించడంలోను, రాజకీయంగా తమిళులను దేశంలో కలుపుకోవడంలోనూ శ్రీలంక ప్రగతి సాధించలేదని తాము ఇస్తున్న సాయం బాధితులకు అందకుండా మిలట్రీ జోక్యం చేసుకుంటోందని అమెరికా ప్రతినిధి తమ చర్యకు కారణంగా చెప్పాడు. ది…


