శ్రీలంక మానవహక్కుల తీర్మానాన్ని నీరుగార్చిన అమెరికా
శ్రీలంక పాలకులపై కన్నెర్రజేసినట్లు కనిపించిన అమెరికా చివరికి తన అసలు రంగు చూపించింది. ఎల్.టి.టి.ఇ తో జరిగిన యుద్ధంలో చివరి రోజుల్లో అమాయక తమిళ ప్రజలపై శ్రీలంక సైనికులు సాగించిన అమానుష హత్యాకాండను ఖండిస్తూ, అంతర్జాతీయ విచారణకు అంగీకరించాలని ఒత్తిడి చేస్తూ ఐరాస మానవహక్కుల సంస్థలో ఆమోదించడానికి తయారు చేసిన తీర్మానాన్ని తీవ్రంగా నీరుగార్చింది. అలంకార పదజాలంతో నిప్పులు కక్కుతూ రాసిన భాషను తొలగించి అలంకార ప్రాయమైన పరిభాషను చేర్చింది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం తమిళనాడు…

