భారత అణు కర్మాగారాలపై ఐ.ఏ.ఇ.ఏ కి ఫిర్యాదు చేస్తాం -శ్రీలంక

తమ దేశానికి అతి సమీపంలో ఉన్న భారత అణు కర్మాగారాల విషయంలో అంతర్జాతీయ అణు శక్తి సంస్ధకు ఫిర్యాదు చేస్తామని శ్రీలంక ప్రకటించింది. అణు కర్మాగారాలు నిర్మించుకోవడానికి భారత దేశానికి గల హక్కును గుర్తిస్తామనీ అయితే ఆ దేశ అణు కర్మాగారాల నుండి తమ దేశానికి ఎదురయ్యే రేడియేషన్ ప్రమాదం పట్ల మాకు ఆందోళనలున్నాయని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి చంపికా రనవాకా అన్నాడు. పక్క దేశమే అణు కర్మాగారల పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్నపుడు అణు…