పాక్ జెండా ఎగరేసింది హిందూత్వ ముఠాయే

మంగళవారం మరొక ‘హిందూత్వ’ కార్యకర్త అరెస్టుతో పాకిస్ధాన్ జెండా ఎగరేయడం వెనుక జరిగిన కుట్రను పొలీసులు వెల్లడించగలిగారు. కర్ణాటక రాష్ట్రంలో సిందగీ గ్రామ తహసీల్దారు కార్యాలయం ముందు జనవరి ఒకటిన పాకిస్ధాన్ జెండా ఎగరేయడంతో అలజడి చెలరేగింది. మత కల్లోలాను రెచ్చగొట్టడానికే ఈ విధంగా పాకిస్ధాన్ జెండా ‘హిందూత్వ’ కార్యకర్తలు ఎగరేశారని పోలీసులు ధృవీకరించారు. ఈ కేసులో ఇప్పటివరకూ అరెస్టయిన వారి సంఖ్య ఏడు కి చేరుకుంది. అరెస్టయిన వారు ‘శ్రీరాం సేన’ సభ్యులని పొలిసులు తెలిపారు.…