దేశ దేశాల్లోని రైతు భాష ‘శ్రమే’ -ఫోటోలు
ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా రైతు కూలీలకి తెలిసిన భాష ‘శ్రమ’ ఒక్కటే. కొండలనుండి గడ్డిమోపులు దింపే స్విస్ రైతయినా, జొన్న చేలో కలుపు తీసే సత్నాపూర్ పేద రైతయినా వొళ్ళు వంచి రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించవలసిందే. ఇండియానాలో బ్లూ బెర్రీ ని తుంచి పోగు చేసే పెద్దా పిన్నా అయినా, బోర్డీక్స్ (ఫ్రాన్స్) లో ద్రాక్ష గుత్తుల్ని తెంచే ఆడా మగా అయినా సిగలు ముడేసి, నడుం బిగించి చెమట చుక్కలతో పుడమితల్లిని…
