ప్రజల సొమ్ము దోచుకోండి, కానీ బందిపోట్లలా కాదు -యు.పి మంత్రి

మాయావతి అవినీతి పై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అధికారులకు ప్రజల సొమ్ము దొంగిలించడానికి అనుమతి ఇచ్చేసింది. కాకపోతే మరీ బందిపోటు దొంగల్లా దోచుకోకుండా, దొంగిలించవచ్చని సున్నితంగా బోధించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కి బాబాయి అయిన శివ్ పాల్ సింగ్ యాదవ్ ఈ ఆణి ముత్యాలను తన శాఖ అధికారులకు బోధించాడు. తద్వారా సర్వ వ్యాపితం అయిన అవినీతి ని నాలుగు గోడల మధ్య చట్టబద్ధం చేశాడు.…