మమతకు ప్రజల ప్రశ్నలు సుత్తీ కొడవళ్ళుగా కనిపిస్తున్నాయా? -కార్టూన్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఫాసిస్టు విన్యాసాలు కొనసాగుతున్నాయి. ప్రజలిచ్చిన అధికారాన్ని ప్రజలపై విరుచుకు పడడానికే వినియోగిస్తున్నది. ప్రజలకు కావలసింది శుష్క వాగ్దానాలు కావనీ, ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నావని ప్రశ్నించినందుకు టి.బి తో బాధపడుతున్న ఒక సాధారణ రైతును అరెస్టు చేసి దొంగ కేసులు బనాయించింది. బుధవారం పశ్చిమ మిడ్నపూర్ లో బహిరంగ సభ పూర్తయ్యాక ఎప్పటిలాగే ప్రశ్నలు అడగాలని కోరిన మమత రైతులకోసం ఏమి చేస్తున్నారన్న ప్రశ్నను సహించలేకపోయింది.…