న్యాయ సలహాలను పెడచెవిన పెట్టి లిబియా యుద్ధానికి దిగిన ఒబామా

తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని వాగ్దానం చేసి అధికారానికి వచ్చిన ఒబామా ఆఫ్ఘనిస్ధాన్‌కి మరింతమంది సైనికుల్ని పంపడమే కాకుండా, కొత్తగా లిబియా యుద్ధానికి గూడా తెగబడ్దాడు. ఈ రెండు చర్యలతో ఒబామా అమెరికా ప్రజల్ని ఘోరంగా మోసం చేశాడు. అయితే ఆయన ప్రజల్ని మోసం చేయడమే కాకుండా అమెరికా చట్టాల్ని కూడా ఉల్లంఘించి లిబియాపై యుద్ధం కొనసాగిస్తున్నాడని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అనేకులు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ పార్టీ నాయకుడు…