పార్లమెంటుకు 4 కి.మీ దూరంలో బలవంతపు వ్యభిచారం

ఢిల్లీ మెడికల్ విద్యార్ధిని నిర్భయ సామూహిక అత్యాచారం దరిమిలా వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి సమాధానం ఇస్తూ ప్రధాని మన్మోహన్ ‘మహిళల రక్షణే తమ ప్రభుత్వానికి ప్రధమ ప్రాధాన్యం’ అని ప్రకటించారు. కానీ ఆయన ఆ ప్రకటన చేసిన పార్లమెంటు భవనానికి నాలుగు కి.మీ దూరం లోపలే వివిధ రాష్ట్రాల నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన బాలికల చేత బలవంతపు వ్యభిచారం చేయిస్తున్న అమానుషం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ నుండి కిడ్నాప్ చేసి తెచ్చిన టీనేజి అమ్మాయిని బంధించి…